Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

భర్తకు నిద్ర మాత్రలు కలిపి బెడ్రూంలోనే ప్రియుడితో ఎంజాయ్, ఆ తర్వాత?

భర్తకు నిద్ర మాత్రలు కలిపి బెడ్రూంలోనే ప్రియుడితో ఎంజాయ్, ఆ తర్వాత?
, శనివారం, 17 జులై 2021 (16:15 IST)
ఇద్దరు పిల్లల తల్లి. ఉద్యోగస్తురాలు. తనతో పాటు పనిచేసే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. భర్త కన్నా ప్రియుడితోనే ఎక్కువగా ఎంజాయ్ చేయాలనుకుంది. అదే ఆమెకు బాగా నచ్చింది. అదే కొనసాగించాలనుకుని భర్త హత్యకు ప్లాన్ చేసింది. 
 
నెల్లూరు జిల్లా కోవూరు కొత్తూరు గ్రామానికి చెందిన రవీంద్ర, కలువాయి మండలం పెరమనకొండ గ్రామానికి చెందిన సమతకు 14 యేళ్ళ క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. పెళ్ళయిన కొన్నిరోజులకే వీరు కాపురం మార్చారు. దీంతో రవీంద్ర అల్లూరు మండలంలో పని చేసుకుంటూ బతుకీడుస్తున్నాడు. 
 
సమత కోవూరులో గ్రామ వాలంటీర్‌గా పనిచేస్తోంది. వాలంటీర్‌గా పనిచేస్తున్న సమతకు గ్రామ సచివాలయంలో పనిచేసే రాము అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది. బయట ఎక్కడైనా కలిస్తే అందరికీ తెలిసిపోతుందన్న భయంతో సమత ఏకంగా తన ఇంటిలోనే సరససల్లాపాల్లో మునిగితేలేది.
 
పిల్లలిద్దరూ వేరే గదిలో పడుకొని ఉంటే భర్త, భార్య మాత్రం మరో గదిలో ఉండేవారు. దీంతో ప్రతిరోజు భర్త తాగే పాలలో నిద్రమాత్రలు కలిపి తాగించేది. ఇది కాస్త తెలియని భర్త రోజూ గాఢనిద్రలోకి వెళ్లిపోయేవాడు. ఇలా భర్త బెడ్ పైన నిద్రపోతూ ఉండగా ప్రియుడితో సమత శృంగారంలో మునిగితేలేది.
 
తన ఇంట్లో జరిగే బాగోతం చాలారోజుల వరకు భర్తకు తెలియదు. అయితే గ్రామసచివాలయంలోని కొంతమంది సిబ్బంది ద్వారా భార్య బాగోతం తెలిసింది. ఆమెను హెచ్చరించారు. దీంతో అసలు విషయం తెలిసిపోయిందన్న భయంతో ఆమె ప్రియుడితో కలిసి భర్తను చంపేందుకు ప్లాన్ చేసింది. 
 
నిద్రమత్తులో ఉన్న భర్తను ప్రియుడితో కలిసి దిండును ముఖంపై అదిపిపెట్టి ఊపిరాడకుండా చేసి అతి కిరాతకంగా చంపేశారు. ఆ తరువాత గుండె నొప్పి అని నమ్మించే ప్రయత్నం చేసింది సమత. బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటపడింది. నిందితురాలిని అదుపులోకి తీసుకోగా ప్రియుడు పరారీలో ఉన్నాడు. రాము కోసం పోలీసులు గాలిస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తెదేపాలో తగిన గుర్తింపు లేదు .. అందుకే తప్పుకుంటున్నా : శోభా హైమావతి