Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

9వ అంతస్థు నుంచి భార్య దూకేసింది.. భర్త చేయి పట్టుకున్నాడు.. కానీ..?

Advertiesment
9వ అంతస్థు నుంచి భార్య దూకేసింది.. భర్త చేయి పట్టుకున్నాడు.. కానీ..?
, గురువారం, 15 జులై 2021 (23:23 IST)
భార్యాభర్తల మధ్య జరిగిన గొడవ పెద్ద హైడ్రామాకు దారి తీసింది. 9వ అంతస్తు నుంచి కిందకు దూకిన ఆమెను భర్త గట్టిగా పట్టుకొని కాపాడటానికి ప్రయత్నించాడు. ఇదంతా చూసిన స్థానికులు టెన్షన్‌తో వణికిపోయారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో వెలుగు చూసింది. ఇక్కడ విజయనగర్‌ ప్రాంతంలోని సేవియర్ సొసైటీలో ఫరాజ్ హసన్, సాదియా దంపతులు నివశిస్తున్నారు.
 
వీళ్లిద్దరు ఇక్కడ 9వ అంతస్తులోని ప్లాటులో ఉంటున్నారు. మంగళవారం నాడు వీళ్లిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ గొడవ చిలికిచిలికి గాలివానలా పెద్ద గొడవకు దారితీసింది. దీంతో కోపంతో ఊగిపోయిన సాదియా.. వేగంగా పరిగెత్తి బాల్కనీ తలుపు తీసి అక్కడి నుంచి కిందకు దూకేసింది. అయితే ఆమె వెనుకే వేగంగా వచ్చిన ఫరాజ్.. వెంటనే స్పందించి సాదియా చెయ్యి పట్టుకున్నాడు. దీంతో ఆమె కింద పడకుండా ఆగింది.
 
భార్య చెయ్యి పట్టుకొని ఆమె కింద పడకుండా కాపాడిన ఫరాజ్.. పెద్దగా కేకలు వేసి చుట్టుపక్కల వారిని అప్రమత్తం చేశాడు. ఇది చూసిన సొసైటీలోని స్థానికులు వెంటనే తమ ఇళ్లలోని పరుపులు, దుప్పట్లు తీసుకొచ్చి ఆ బిల్డింగ్ కింద పరిచారు. 
 
ఇలా కనీసం మూడు నిమిషాల పాటు భార్యను పట్టుకొని ఉన్న ఫరాజ్.. ఆ తర్వాత చెయ్యి జారడంతో ఆమెను వదిలేశాడు. దీంతో 9వ అంతస్తు నుంచి సాదియా కింద పడిపోయింది. ఈ ఘటనలో ఆమెకు తీవ్రగాయాలైనాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ కావడంతో పోలీసులు రంగంలోకి దిగారు. దర్యాప్తు ప్రారంభించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Reliance Jio Rs 151 వర్క్ ఫ్రమ్ హోమ్ ప్లాన్: ఆఫర్స్ ఏంటంటే?