Webdunia - Bharat's app for daily news and videos

Install App

అరకు లోయలో విషాదం : ముగ్గురు పిల్లలతో తల్లి ఆత్మహత్య

Webdunia
ఆదివారం, 18 జులై 2021 (13:06 IST)
విశాఖపట్టణం జిల్లా అరకు లోయలో విషాదం జరిగింది. ముగ్గురు పిల్లలతో సహా తల్లి అనుమానాస్పదంగా మృతి చెందింది. తల్లి ఓ గదిలో ఉరి వేసుకొని చనిపోగా.. ముగ్గురు చిన్నారులు మరో గదిలో మంచంపై విగతజీవులుగా పడివున్నారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, అరకులోయ పట్టణ పరిధిలోని పాత పోస్టాఫీస్‌ కాలనీలో సంజీవ్‌, సురేఖ‌(28) దంప‌తులు నివ‌సిస్తున్నారు. వీరికి కుమారై సుశాన‌(9), కుమారులు ష‌ర్విన్‌(6), సిరిల్‌(4) సంతానం. గిరిజ‌న స‌హ‌కార సంస్థ‌లో ఒప్పంద సేల్స్‌మెన్‌గా సంజీవ్ ప‌నిచేస్తున్నాడు. 
 
అయితే, గ‌త కొద్ది రోజులుగా భార్యా భ‌ర్త‌ల మ‌ధ్య గొడ‌వ‌లు జ‌రుగుతున్నాయి. శుక్రవారం సాయంత్రం 4 గంటల సమయంలో సంజీవరావు ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయాడు. తిరిగి రాత్రి 10 గంట‌ల స‌మయంలో ఇంటికి వ‌చ్చాడు. ముగ్గురు చిన్నారులు మంచంపై విగ‌త‌జీవులుగా క‌నిపించ‌గా.. భార్య మ‌రో గ‌దిలో ఉరికి వేలాడుతూ క‌నిపించింది. 
 
స్థానికుల సాయంతో వారిని ఆస్ప‌త్రికి తీసుకెళ్లాడు. అయితే.. వారు అప్ప‌టికే మృతి చెందిన‌ట్లు డాక్ట‌ర్లు చెప్పారు. ముగ్గురు పిల్ల‌ల‌కు విష‌మిచ్చి.. భార్య‌ ఉరివేసుకుంద‌ని భ‌ర్త సంజీవ్ చెబుతున్నాడు. అయితే.. ముగ్గురు పిల్ల‌ల‌ను చంపి.. భార్య‌కు ఉరి వేసి వారిని త‌న అల్లుడే హ‌త్య చేశాడ‌ని మృతురాలి తండ్రి ఆరోపిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nidhi Agarwal: ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్‌లో చిక్కిన పవన్ హీరోయిన్ నిధి అగర్వాల్ (video)

Jwala Gutta: గుండె జారి గల్లంతయ్యిందేలో ఐటమ్ సాంగ్‌తో ఇబ్బంది పడ్డాను.. జ్వాలా గుత్తా

Keerthy Suresh సోషల్ మీడియాలో ట్రెండ్ అయిన కీర్తి సురేష్

Nag Ashwin: నాని, విజయ్ దేవరకొండ కాంబో సినిమా, కల్కి 2 గురించి నాగ్ అశ్విన్ ఏమన్నాడంటే

రొమాంటిక్ థ్రిల్లర్ గా కిల్లర్ ఆర్టిస్ట్ సినిమా: ప్రొడ్యూసర్ జేమ్స్ వాట్ కొమ్ము

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

Fennel Water: పరగడుపున సోంపు నీటిని తాగితే ఏంటి లాభం? ఎవరు తాగకూడదు..?

Banana: మహిళలు రోజూ ఓ అరటి పండు తీసుకుంటే.. అందం మీ సొంతం

అమెరికా తెలుగు సంబరాలు: తెలుగు రాష్ట్రాల సీఎంలకు నాట్స్ ఆహ్వానం

తర్వాతి కథనం
Show comments