శ్రీకాకుళం జిల్లాలో దారుణం జరిగింది. బతికుండగానే ఆమె తల్లి చిన్నారిని పూడ్చి పెట్టించింది. నందిగాం మండలానికి చెందిన ఓ మహిళ గర్భం దాల్చటంతో గురువారం కాశీబుగ్గలో ఓ వైద్యుడి వద్దకు వచ్చింది. ఆమెకు ప్రస్తుతం ఏడో నెల. ఏమైందో తెలియదు గానీ.. ఆమె కోరడంతో వైద్యుడు శస్త్రచికిత్స చేసి బిడ్డను బయటకు తీశారు.
ఆ తల్లి తనకు ఆడపిల్ల పుట్టిందని.. అక్కడ ఉన్న ఓ వ్యక్తికి ఆ బిడ్డను తెల్లని వస్త్రంలో చుట్టి తీసుకెళ్లి ఖననం చేయమంది. తీసుకెళ్లిన ఆ వ్యక్తి బిడ్డను ఖననం చేసే ముందు ఫొటోలు, వీడియో తీయగా అవి శుక్రవారం సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్ చేయడంతో విషయం బయటకు పొక్కింది.
ఆ బిడ్డను బతికుండగానే పాతిపెట్టినట్లు తెలుస్తోంది. ఈ విషయమై కాశీబుగ్గ సీఐ శంకరరావును అడగ్గా.. విషయం తమ దృష్టికి రాలేదన్నారు. శిశువు తల్లి కాశీబుగ్గలోనే చికిత్స పొందుతున్నట్లు తెలిసింది.