Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పొట్టకూటి కోసం వేశ్యలుగా మారిన తల్లికూతుళ్లు!

పొట్టకూటి కోసం వేశ్యలుగా మారిన తల్లికూతుళ్లు!
, బుధవారం, 7 జులై 2021 (18:14 IST)
కరోనా మహమ్మారి పేదల జీవితాన్ని అస్తవ్యస్తం చేసింది. కరోనా కారణంగా దేశంలో కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ విధించిన సంగతి తెలిసిందే. ఇక లాక్‌డౌన్‌ కారణంగా చాలా రంగాలు కుదేలవడమే గాక వాటిపై ఆధారపడుతున్న బతుకులను తలకిందులు చేసిందనే చెప్పాలి. 
 
కొందరి పరిస్థితి దయనీయంగా మారి పూటకు కూడా తిండి దొరకని తిప్పలు తీసుకొచ్చింది. ఈ క్రమంలో కనీస అవసరాలను తీర్చుకోవడానికి ఓ తల్లి కూతుర్లు వేశ్య వృత్తిని ఎంచుకునేలా చేసింది. ఈ ఘటన పంజాబ్‌లో చోటుచేసుకుంది.
 
వివరాల్లోకి వెళితే.. పంజాబ్‌లోని ముక్త్సార్‌లో ఇటీవల విధించిన లాక్‌డౌన్‌ కారణంగా ఓ తల్లి తన కూతురు వారి ఉద్యోగాన్ని కోల్పోయారు. ఉపాధి కోల్పోవడంతో రోజులు గడిచే కొద్ది వాళ్ల పరిస్థితి దయనీయ స్థితికి చేరుకుంది. ఎంత ప్రయత్నించినా వేరెక్కడా పని దొరకలేదు. ఒక్కోరోజు తిండి తినడానికి కూడా కష్టమవడంతో, చివరికి వేరేదారిలేక పొట్టకూటి కోసం ఆ తల్లి వేశ్యగా మారింది.
 
అంతేకాదు తన కూతురిని కూడా వేశ్యగా మార్చేసింది. ఓ ప్రాంతంలో వ్యభిచారం జరుగుతోందని పోలీసులకు పక్కాగా సమాచారం అందడంతో అక్కడి వెళ్లి రైడ్‌ చేయగా అందులో ఈ తల్లి కూతుళ్లు అరెస్ట్‌ చేశారు. విచారణలో ఆ మహిళ ఆకలి బాధ తట్టుకోలేక, వేరే పని దొరకక ఇలా వేశ్య వృత్తిని ఎంచుకున్నట్లు వాపోయింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

యూపీలో దారుణం.. భార్యను సజీవ దహనం చేసి...?