Webdunia - Bharat's app for daily news and videos

Install App

యాప్ నిర్వాహకుల వేధింపులకు ఇంజనీరింగ్ విద్యార్థి మృతి

Webdunia
మంగళవారం, 11 జులై 2023 (09:18 IST)
తెలంగాణ రాష్ట్రంలోని మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురులో ఒక ఇంజనీరింగ్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. యాప్ నిర్వాహకుల వేధింపులు తాళలేక ఈ విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, నెల్లికుదురు మండలం కొండెంగలగుట్ట తండాకు చెందిన బానోతు అచ్చాలి - కుస్సా దంపతుల కుమారుడు ఆకాశ్ (22) హైదరాబాద్ నగరంలోని ఓ ప్రైవేట్ కాలేజీలో ఇంజనీరింగ్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. 
 
ఈ విద్యార్థి కొన్ని నెలల క్రితం ఒక రుణ యాప్ ద్వారా రూ.30 వేల రుణం తీసుకున్నాడు. ఈ మొత్తాన్ని సకాలంలో తిరిగి చెల్లించకపోవడంతో యాప్ నిర్వాహకులు నుంచి ఒత్తిడితో పాటు వేధింపులు మొదలయ్యాయి. ఈ విషయం తల్లిదండ్రులకు చెప్పగా, పొదుపు సంఘం నుంచి రుణం తీసుకుని చెల్లిద్దామని చెప్పాడు. 
 
ఇంతలో యాప్ నిర్వాహకుల నుంచి ఒత్తిడి ఎక్కువ కావడంతో ఆదివారం సాయంత్రం హైదరాబాద్ నుంచి ఇంటికి వచ్చిన ఆకాశ్.. ఆత్మహత్య చేసుకున్నారు. కుటుంబ సభ్యులు నిద్రిస్తున్న సమయంలో ఇంట్లోనే చీరతో ఉరేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Venkatesh: విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ సినిమా మొదలు

ఇండస్ట్రీలో ఎవరి కుంపటి వారిదే : అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు

పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ప్రభాస్ స్పిరిట్ లో కనిపించనున్నారా !

పెంచల్ రెడ్డి జీవిత కథతో ఆపద్భాంధవుడు చిత్రం: భీమగాని సుధాకర్ గౌడ్

Chiranjeevi: చిరంజీవితో విశ్వంభర లో సత్యలోకం చూపిస్తున్న వసిష్ఠ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

తర్వాతి కథనం
Show comments