Webdunia - Bharat's app for daily news and videos

Install App

మద్యం మత్తులో మహిళను వివస్త్రను చేసిన వ్యక్తి... ఎక్కడ?

Webdunia
సోమవారం, 7 ఆగస్టు 2023 (15:06 IST)
పీకల వరకు మద్యం సేవించిన ఓ వ్యక్తి మద్యం మత్తులో ఓ మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. ఏకంగా ఆమెను వివస్త్రను చేశాడు. ఈ ఘటన హైదరాబాద్ నగరం పరిధిలోని జవహర్ నగర్ ఏరియాలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధికి చెందిన పెద్దమారయ్య (30) అనే వ్యక్తి కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. 
 
అదేసమయంలో పచ్చితాగుబోతు కూడా. ఆదివారం రాత్రి 8.30 గంటల ప్రాంతంలో తన తల్లితో కలిసి బాలాజీ నగర్ బస్టాండ్ నుంచి ఇంటికి నడిచి వెళుతున్నాడు. ఆసమయంలో అదే ప్రాంతానికి చెందిన ఓ మహిళ (28) దుకాణం నుంచి నడుచుకుంటూ రోడ్డుపై వెళుతున్నది. ఆమెను చూసిన మారయ్య.. ఆమెపై చేయి వేసి అసభ్యంగా ప్రవర్తిచాడు. దీంతో అతన్ని ఆమె దూరంగా నెట్టేసింది. 
 
దీంతో విచక్షణ కోల్పోయిన మారయ్య... ఆమె పట్ల దురుసుగా ప్రవర్తిస్తూ, దుస్తులను చింపేశాడు. దీన్ని పక్కనే ఉన్న తల్లి కనీసం ఆపే ప్రయత్నం చేయలేదు. ఆ సమయంలో అటుగా ఓ బైకుపై వచ్చిన ఓ మహిళ ఎందుకు ఇలా చేస్తున్నావంటూ ప్రశ్నించడంతో ఆమెపై కూడా దాడి చేశాడు. అలా దాదాపు 15 నిమిషాల పాటు ఆ యువతి దుస్తులు లేకుండా రోడ్డుపై కూర్చొన్నా చుట్టుపక్కల వారి నుంచి కనీస స్పందన రాలేదు. ఆ తర్వాత ఆ పోకిరి వెళ్లిపోయిన తర్వాత కొందరు స్థానికులు వచ్చిన బాధితురాలిపై కవర్లు కప్పి, స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మహేష్ బాబు, జాన్ అబ్రహం, ప్రియాంక చోప్రా కాంబినేషన్ షురూ

హైలెస్సో హైలెస్సా అంటూ పాడుకుంటున్న నాగ చైతన్య, సాయి పల్లవి

చిలుకూర్ బాలాజీని దర్శించుకున్న ప్రియాంకా చోప్రా

Venu Swamy: నాగ చైతన్య-శోభితలకు వేణు స్వామి క్షమాపణలు.. ఇకపై నోరెత్తను

యూఫోరియా మ్యూజికల్ నైట్ లో ప్రతి ఒక్క రూపాయి సమాజ సేవకే : నారా భువనేశ్వరి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

యునిసెఫ్‌తో కలిసి తిరుపతిలో 'ఆరోగ్య యోగ యాత్ర' ఫాగ్సి జాతీయ ప్రచారం

Winter Stroke శీతాకాలంలో బ్రెయిన్ స్ట్రోక్, నివారించే మార్గాలు

పాండ్స్ యూత్‌ఫుల్ మిరాకిల్ రేంజ్ లాంచ్

ప్రతిరోజూ బాదం తినడం వల్ల కలిగే 8 ఆరోగ్య ప్రయోజనాలు

Golden Milk: గోల్డెన్ మిల్క్ హెల్త్ బెనిఫిట్స్

తర్వాతి కథనం
Show comments