లారీకి పట్టకప్పి ఘాతుకానికి పాల్పడ్డారు... సి.సి.కెమెరాలో లారీ

Webdunia
బుధవారం, 11 డిశెంబరు 2019 (21:40 IST)
దిశ అత్యాచారం, హత్య కేసులో నిందితులు నలుగురిని ఎన్ కౌంటర్ చేసినా సరే ఆ యువతి పడిన బాధ అందరినీ కలచివేస్తోంది. పోలీసుల విచారణలో ఆ యువకులు చెప్పిన మాటలు అలాంటివి. మొదట్లో నలుగురు కలిసి సామూహిక అత్యాచారం చేశారు. ఆ తరువాత లారీలోను అత్యాచారం చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడించారు.
 
గంటన్నరపాటు అతి దారుణంగా దిశకు నరకం చూపించిన ఆ మృగాళ్ళు ఆ తరువాత లారీలోను అత్యాచారానికి పాల్పడ్డారు. దిశ అప్పటికే అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోవడంతో లారీలో అత్యాచారం జరిగిన సమయంలో పట్ట కప్పినట్లు పోలీసులు గుర్తించారు. ఆ సి.సి. ఫుటేజ్‌ను పోలీసులు తాజాగా స్వాధీనం చేసుకున్నారు. లారీ కదిలినప్పటి నుంచే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలుస్తోంది.
 
అయితే పట్ట కప్పి ఉండడం.. పూర్తిగా చీకటి కావడంతో ఎవరూ కూడా ఈ మృగాళ్ళ అకృత్యాలను గుర్తించలేకపోయారు. దీంతో దిశ చివరకు ప్రాణాలను కోల్పోయింది. నిందితులను ఎన్ కౌంటర్ చేసినా మహిళా సంఘాలు, విద్యార్థి సంఘాల్లో మాత్రం ఈ ఘటనపై ఇప్పటికీ ఆగ్రహావేశాలు ఏమాత్రం తగ్గడంలేదు. ఒంటరిగా ఉన్న ఒక యువతిపై ఇంత దారుణానికి మృగాళ్ళు పాల్పడటం దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హైదరాబాద్‌లో సరికొత్త ఫార్మెట్ లో ఐమాక్స్ స్క్రీన్ : సునీల్ నారంగ్

Sandigdham Review: మిస్టరీ, థ్రిల్లింగ్ కథతో నిహాల్, ప్రియా దేశ్‌పాగ్ చిత్రం సందిగ్ధం మూవీ రివ్యూ

Sanjay Rao: హిట్ అండ్ రన్ ఫస్ట్ లుక్ తో సంజయ్ రావ్ క్రేజ్

మహేష్ బాబు అతిథి 4K థియేటర్లలో పాలాబిషేకంతో అభిమానుల సందడి

Sandeep Reddy Vanga: సందీప్ రెడ్డి వంగా చిత్రానికి రోమాంచకం టైటిల్ ఖరారు

తర్వాతి కథనం
Show comments