Publish Date: Wed, 11 Dec 2019 (17:45 IST)
Updated Date: Wed, 11 Dec 2019 (17:49 IST)
దిశ హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా కుదిపేసింది. ఈ ఘటనపై గతంలో తెలంగాణ డిప్యూటీ సీఎం వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే బాటలో తెలంగాణ రాష్ట్రంలోని కామారెడ్డి జడ్పీ చైర్ పర్సన్ శోభ చేరిపోయారు. దిశకు తన తల్లిదండ్రులతో సఖ్యత లేకపోవడంతోనే ఆపద సమయంలో వారికి ఫోన్ చేయకుండా తన సోదరికి ఫోన్ చేసిందనీ, అందుకే అలా చిక్కుకుపోయిందని అన్నారు.
ఆ సమయంలో ఆమె తన చెల్లికి బదులు తండ్రికి ఫోన్ చేసి వుంటే ఆయన కాపాడే అవకాశం వుండేదన్నారు. గెజిటెడ్ ఆఫీసర్ అయిన దిశ అలా భయపడాల్సింది కాదనీ, ఆమె పోలీసులకి ఫోన్ చేసి వుండాల్సిందన్నారు. తల్లిదండ్రులు ఆమెకి చిన్నప్పట్నుంచి ధైర్యం నూరిపోయలేదనీ, అందుకే ఆమె అలా భయపడిందని వ్యాఖ్యానించారు. మహిళలపై అత్యాచార ఘటనల నేపథ్యంలో జిల్లా పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆమె పై వ్యాఖ్యలు చేశారు. ఇపుడీ వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి.