Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

'దిశ'పై చర్చ జరుగుతుంటే ఉల్లిపాయ గొడవా? లోకేష్‌కు పప్పులో ఉల్లి తక్కువైందా? రోజా సెటైర్లు

'దిశ'పై చర్చ జరుగుతుంటే ఉల్లిపాయ గొడవా? లోకేష్‌కు పప్పులో ఉల్లి తక్కువైందా? రోజా సెటైర్లు
, సోమవారం, 9 డిశెంబరు 2019 (19:13 IST)
శాసనసభ సమావేశాలు నేటి నుంచి ప్రారంభమయ్యాయి. సమావేశాల్లో మొదటగా దిశ హత్య కేసుకు సంబంధించి చర్చ జరగాలని.. ఎపిలో అలాంటి ఘటనలు జరగకుండా కఠిన చట్టాలు తీసుకువచ్చేందుకు ప్రభుత్వం చేయాలనుకుంది. పోలీసులను మరింత అప్రమత్తం చేయడంతో పాటు ప్రతిపక్ష పార్టీ నేతల సలహాలు కూడా తీసుకొని ముందుకు సాగాలని ఎపి సిఎం జగన్మోహన్ రెడ్డి భావించారు.
 
అయితే సీన్ మొత్తం రివర్స్ అయ్యింది. ఏకంగా టిడిపి నేతలు ఉల్లిని మెడకు వేసుకుని నిరసనకు దిగారు. ఉల్లి ధరలు ఆకాశాన్నంటుతున్నాయని, ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదంటూ తీవ్రస్థాయిలో విమర్సలు గుప్పిస్తూ అసెంబ్లీకి చేరుకున్నారు. దీంతో అసెంబ్లీ ప్రాంగణం గేట్ల వద్దే సెక్యూరిటీ అడ్డుకుంటే చివరకు చేసేది లేక ఉల్లిపాయలను అక్కడే వదిలేసి సభలోకి వచ్చేశారు టిడిపి ఎమ్మెల్యేలు.
 
అయితే మహిళల భద్రత గురించి సిఎంతో పాటు హోంమంత్రి మేకపాటి సుచరిత మాట్లాడుతుండగా ఒక్కసారిగా టిడిపి నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఉల్లిపై పెద్ద రాద్దాంతమే చేశారు. దీంతో వైసిపి ఎమ్మెల్యే రోజాకు తీవ్ర ఆగ్రహం వ్యక్తం వచ్చింది. చంద్రబాబూ... అంటూ ఆమె ధ్వజమెత్తారు. దిశ ఘటన దేశ ప్రజలను భయాందోళనకు గురి చేసింది. దిశను అతి దారుణంగా అత్యాచారం చేసి హత్య చేసిన ఘటన తనను తీవ్రంగా కలచి వేసిందని చెప్పారు రోజా.
 
ఇప్పుడు వచ్చిన తీర్పు ప్రతి కామాంధుడి వెన్నులో వణుకు పుట్టిస్తోందని చెప్పుకొచ్చారు రోజా. ఇంత జరుగుతుంటే ఆ చర్చకు సహకరించాల్సిన టిడిపి నేతలు ఎందుకు అడ్డుపడుతున్నారంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నారా లోకేష్ పప్పు తినడానికి ఉల్లి తక్కువైనట్లు ఉంది. అందుకే చంద్రబాబు ఎగిరెగిరి ఆడుతున్నారంటూ విమర్సించారు రోజా. టిడిపి ఎమ్మెల్యేలను తీవ్రస్థాయిలో విమర్శించారు. దీంతో ఉన్న ఎమ్మెల్యేలే తక్కువ కావడంతో అసెంబ్లీలో వారు అరిచినా ఉపయోగం లేకుండా పోయింది. రోజా ప్రసంగాన్ని సిఎం ఆసక్తిగా వినడమే కాదు సహచర ఎమ్మెల్యేలు ఆమె ప్రసంగాన్ని అభినందిస్తూ బల్లలపై చరిచారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దిశ నిందితుల ఎన్ కౌంటర్: హ్యాట్సాఫ్ కేసీఆర్ అంటూ ఏపీ సీఎం జగన్-video