Webdunia - Bharat's app for daily news and videos

Install App

డ్రైనేజీ గుంతలో పడి గల్లంతైన టెక్కీ మృతదేహం లభ్యం

Webdunia
సోమవారం, 27 సెప్టెంబరు 2021 (18:34 IST)
డ్రైనేజీ గుంతలో పడి గల్లంతైన టెక్కీ మృతదేహాన్ని గోల్డెన్ టెంపుల్‌కు సమీపంలో ఉన్న నెక్నంపూర్‌ చెరువులో పోలీసులు గుర్తించారు. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ మణికొండలో నివాసముండే గోపిశెట్టి రజనీకాంత్‌ (42) షాద్‌నగర్‌లోని నోవా గ్రీన్‌ కంపెనీలో ఆయన సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. 
 
శనివారం రాత్రి 9 గంటలకు ఇంటి నుంచి బయటకు వచ్చిన రజనీకాంత్‌ తన ఇంటికి 50 మీటర్ల దూరంలో నిర్మాణంలో ఉన్న డ్రైనేజీ గుంతలో పడి గల్లంతయ్యాడు. ఇలా మణికొండలో నాలాలో శనివారం కొట్టుకుపోయిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ మృతదేహం లభ్యమైంది. 
 
రజనీకాంత్ డ్రైనేజీలో కొట్టుకుపోయారనే సమాచారంతో రెండు డీఆర్‌ఎఫ్‌ బృందాలు సహాయచర్యల్లో పాల్గొన్నాయి. నాలాలు కలిసే చోట, నెక్నాంపూర్‌ చెరువు వద్ద గాలింపు చేపట్టారు. సోమవారం మధ్యాహ్నం చెరువులో ఆయన మృతదేహాన్ని ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది గుర్తించి వెలికితీశారు. రజనీకాంత్‌ కోసం రెండ్రోజులుగా 60 మంది సిబ్బంది గాలింపు చేపట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆ రోజు రాత్రికే 'పుష్ప-2' సత్తా ఏంటో తెలిసిపోతుంది : రాజమౌళి

ఒక సెక్షన్ మీడియా అత్యుత్సాహం చూపుతుంది : ఆర్జీవీ

సిల్క్ స్మిత అఫీషియల్ బయోపిక్ లో చంద్రిక రవి

శ్రీ కనకదుర్గమ్మవారి ఆశీస్సులు కోరిన హరిహరవీరమల్లు టీమ్

ముంబై మెట్రో రైలెక్కిన పుష్ప 2.. ఎందుకు? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపిని సహజసిద్ధంగా తగ్గించుకునే మార్గాలు

రేడియోథెరపీ, ఇంటర్‌స్టీషియల్ బ్రాకీథెరపీని ఉపయోగించి తీవ్రస్థాయి గర్భాశయ సంబంధిత క్యాన్సర్‌ కి చికిత్స

Asthma in Winter Season, ఈ సమస్యను తెచ్చే ఆహార పదార్ధాలు, పరిస్థితులు

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments