Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అత్తగారింట్లో కోడలు ఆత్మహత్య ... ఎందుకో పాపం?

Advertiesment
Karim Nagar
, బుధవారం, 15 సెప్టెంబరు 2021 (08:14 IST)
తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లా కోరుట్లలో వున్న అత్తగారింటిలో ఉంటూ వచ్చిన కోడలు ఆ ఇంట్లోనే ఆత్మహత్యకు పాల్పడింది. ఈ బలవన్మరణానికి పాల్పడిన కోడలు ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ కావడం గమనార్హం. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో సోమవారం మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది. 
 
ఎస్సై సతీశ్‌ కథనం ప్రకారం.. జిల్లాలోని మెట్‌పల్లి పట్టణానికి చెందిన ఆడెపు సాయిలక్ష్మి(28)కి 14 నెలల క్రితం కోరుట్లలోని గాంధీరోడ్డులో నివాసం ఉండే కొండబత్తిని రామకృష్ణతో వివాహం జరిపించారు. భార్యాభర్తలిద్దరూ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లే. 
 
అయితే, ప్రస్తుత కరోనా మహమ్మారి కారణంగా వారిద్దర వర్క్ ఫ్రమ్ హోం కింద కోరుట్లలోని తమ ఇంట్లో నుంచే పనిచేస్తున్నారు. సాయిలక్ష్మీ ఇటీవల ఉద్యోగం మానేసింది. మరో జాబ్‌ కోసం ప్రయత్నాలు మొదలుపెట్టింది. 
 
ఇదిలావుంటే, సోమవారం మధ్యాహ్నం ఒంటి గంటకు ఇంట్లో ఎవరూలేని సమయంలో సాయిలక్ష్మీ తన గదిలోకి వెళ్లి లోపల గొళ్లెం పెట్టి చీరతో ఫ్యాన్‌కు ఉరివేసుకుంది. కొంతసేపటికి భర్త రామకృష్ణ వచ్చి సాయిలక్ష్మీ ఆత్మహత్య విషయాన్ని గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు.
 
పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని గొళ్లెం తొలగించి గదిలోకి వెళ్లి మృతదేహాన్ని కిందికి దించారు. తహసీల్దార్‌ సత్యనారాయణ వివరాలు సేకరించారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఉపాధి హామీ పనులను పరిశీలించిన కేంద్ర బృందం