Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఉపాధి హామీ పనులను పరిశీలించిన కేంద్ర బృందం

ఉపాధి హామీ పనులను పరిశీలించిన కేంద్ర బృందం
, బుధవారం, 15 సెప్టెంబరు 2021 (08:04 IST)
శ్రీకాకుళం జిల్లా పార్వతీపురం మండలంలో మంగళవారం కేంద్ర బృందం పర్యటించి పలు ఉపాధి హామీ పనులను పరిశీలించారు. ఈ బృందం సభ్యులు ముందుగా నర్సిపురం పంచాయతీ కారాడవలస గ్రామ పరిధిలో గల ఈదరబంద లో జరిగిన పనులపై క్షేత్ర స్థాయి సహయకులను అడిగి వివరాలు తెలుసుకున్నారు.

స్థానిక వేతన దారులతో మాట్లాడి, అప్పటివరకు నిర్వహించిన పనుల పై ఆరా తీశారు. అనంతరం  పెద్ద బొండపల్లి పంచాయతీ దిబ్బగుడ్డి వలస, గదబ వలస వేతన దారులతో తామర చెరువు గట్టు పై సమావేశం నిర్వహించారు.  పనుల వివరాలు అడిగి తెలుసుకున్నారు.

వేతన దారుల ఆదాయం, పనిదినాలు, ఉపాధి సిబ్బంది సమకూర్చిన సౌకర్యాల గురించి ప్రశ్నించారు. వెలుగు స్వయ సహాయక బృందాల క్లస్టర్ కోఆర్డినేటర్ లతో కూడా మాట్లాడారు. తరువాత నర్సిపురం పంచాయతీ విశ్వంభర పురానికి చెందిన రైతు పోల బాలకోటేశ్వర రావుకు చెందిన 5 ఎకరాల పొలంలో, ఉపాధి హామీ పథకంలో భాగంగా  వేసిన జీడి, మామిడి తోటల పెంపకం గురించి, అతన్ని వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం అదే గ్రామానికి చెందిన దిబ్బ చెరువు పనులు పరిశీలించారు. 
 
సచివాలయం సందర్శన
నర్సి పురం గ్రామ సచివాలయాన్ని కేంద్ర బృందం  సందర్శించింది. ముందుగా సచివాలయంలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులకు వారు నిర్వహిస్తున్న పనులకు సంబంధించిన వివరాల పై ఆరా తీశారు. కార్యాలయంలో నిర్వహిస్తున్న రికార్డులను పరిశీలించారు. 
 
పర్యటనలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ ఎ.సూర్య కుమారి పత్రికా ప్రతినిధులతో మాట్లాడుతూ,  జిల్లాలో రూరల్ డెవలప్మెంట్ మంత్రిత్వ శాఖ నుండి జాయింట్ సెక్రటరీ రావడం జరిగిందని చెప్పారు. జిల్లాలో  ఈ సంవత్సరం, గత సంవత్సరం నిర్వహించిన  మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులు పరిశీలించే నిమిత్తం ఈ బృందం వచ్చిందని తెలిపారు.

పార్వతీపురం మండలంలో మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం క్రింద పూర్తి చేసిన చెరువు పనులు, రోడ్డు పనులు, మొక్కలు పెంపకం పనులు ఎవెన్యు ప్లాంటేషన్ పనులు, వ్యక్తిగతంగా చేసిన ప్లాంటేషన్  పనులను చూడడం జరిగిందన్నారు. 

మన రాష్ట్రంలో అమలవుతున్న గ్రామ సచివాలయం వ్యవస్థ, వలెంటిర్ వ్యవస్థ, గ్రామ సచివాలయంలో  పథకాల అమలు తీరు, నిత్యావసర సరుకుల ఇంటింటికీ అందజేస్తున్న వాహనాన్ని పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేసినట్లు కలెక్టర్ తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

76 మంది జవాన్లను హతమార్చిన మావోయిస్టు అరెస్టు