గత కొద్ది రోజులుగా హైదరాబాదు నగరంలో కుండపోత వర్షం కురుస్తోంది. దీంతో అక్కడి చెరువులు, రిజర్వాయర్లు నిండి వరద ప్రవాహం ముంచెత్తుతున్నాయి. వరద తాకిడికి ప్రజలు ముప్పుతిప్పలు పడతున్నారు. దీంతో హైదరాబాదు నగరంలో భారీగా ఆస్తినష్టం, జన నష్టం జరిగింది.
ఈ నేపథ్యంలో తెలంగాణ సీఎం కేసీఆర్ హైదరాబాదు నగర ప్రజలను ఆదుకోవడానికి ఆర్థిక సహాయంగా 1350 కోట్లు కోరుతూ ప్రధానికి లేఖ వ్రాశారు. దీనికి స్పందించిన కేంద్రం వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలంచేందుకు రేపు కేంద్ర బృందం హైదరాబాదు రానున్నది.
సీఎం కేసీఆర్ నేతృత్వంలో ఈ బృందం హైదరాబాదులో పర్యటించనుంది. హైదరాబాదులో వర్షం మోత మళ్లీ షురూ అయ్యింది. తెల్లవారుజామునే నగరాన్ని చినుకులు పలకరించాయి. ఎల్బీనగర్, ఉప్పల్, దిల్‌సుఖ్ నగర్, సరూర్ నగర్, మొహిదీపట్నం, మాసబ్ ట్యాంక్ ప్రాంతాల్లో ఉదయాన్నే భారీ వర్షం కురిసింది.