హెల్మెట్ లేకుండా వాహనం నడిపితే లైసెన్స్ రద్దు : సైబరాబాద్ పోలీస్

Webdunia
శుక్రవారం, 19 ఫిబ్రవరి 2021 (14:27 IST)
రోడ్డు ప్రమాదాల నివారణకు హైదరాబాద్ నగర పోలీసులు వివిధ రకాలైన చర్యలు చేపడుతున్నారు. విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంల ఇపుడు సరికొత్త కఠిన నిర్ణయం అమలుకు శ్రీకారం చుట్టారు. ఇకపై, హెల్మెట్ లేకుండా వాహనం నడిపితే లైసెన్స్ రద్దు చేస్తామని సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ ప్రకటించింది. 
 
వాస్తవానికి హెల్మెట్ లేకుండా వాహనం నడుపరాదన ట్రాఫిక్ పోలీసులు పదేపదే హెచ్చరికలు చేస్తున్నారు. అయినప్పటికీ నిత్యం వేలాది మంది వాహనచోదకులు ట్రాఫిక్ ఉల్లంఘనలను యధేచ్చగా ఉల్లంఘిస్తున్నారు. హెల్మెట్ లేకుండా వాహనం నడపడం వల్ల ఏదేని ప్రమాదం జరిగితే ప్రాణాలు కోల్పోతున్నారు. హెల్మెట్ పెట్టుకుంటే ప్రాణాపాయం నుంచి త‌ప్పించుకోవ‌చ్చ‌ని తెలిసిన‌ప్ప‌టికీ నిర్ల‌క్ష్యంగా, త‌మ‌కేం కాద‌నే ధోర‌ణితో వ్య‌వ‌హ‌రిస్తుంటారు.
 
దీంతో సైబ‌రాబాద్ ట్రాఫిక్ పోలీసులు నిబంధ‌న‌ల‌ను మ‌రితం క‌ఠిన‌త‌రం చేస్తున్నారు. హెల్మెట్ లేకుండా ద్విచ‌క్ర వాహ‌నాలు నడిపితే శాశ్వతంగా డ్రైవింగ్ లైసెన్స్ రద్దుచేస్తామని హెచ్చరించారు. ఇకపై హెల్మెట్ ధరించకుండా బైక్‌ నడపుతూ పట్టుబడితే చలానాతో సరిపెట్టబోమని ట్విట్ట‌ర్‌లో పేర్కొన్నారు.
 
మోటారు వాహనాల సవరణ చట్టం 2019, సెక్షన్ 206 (4) ప్రకారం హెల్మెట్ లేకుండా బండి నడిపితే డ్రైవింగ్ లైసెన్స్ రద్దవుతుందని చెప్పారు. హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తూ తొలిసారి పట్టుబడితే మూడు నెలలు, రెండోసారి ప‌ట్టుబ‌డితే శాశ్వతంగా డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేయడానికి సంబంధిత ఆర్టీవో అధికారులకు సిఫారసు చేస్తామని తెలిపారు. దీనిపై ఓ వీడియోనూ విడుద‌ల చేశారు.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sudheer: సుడిగాలి సుధీర్, దివ్యభారతి జంటగా G.O.A.T షూటింగ్ పూర్తి

ఆకాష్ జగన్నాథ్ ఆవిష్కరించిన వసుదేవసుతం టైటిల్ సాంగ్

Roshan: రోషన్ హీరోగా పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామాగా ఛాంపియన్

Janhvi Kapoor: రూటెడ్ మాస్ పాత్రలో అచ్చియమ్మ గా జాన్వీ కపూర్

The Girlfriend: ది గర్ల్ ఫ్రెండ్ ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతుంది - ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments