Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బిగ్ బాస్-5కు సర్వం సిద్ధం.. సీన్‌లోకి న్యూస్ ప్రజెంటర్.. మంగ్లీ పేర్లు

Advertiesment
బిగ్ బాస్-5కు సర్వం సిద్ధం.. సీన్‌లోకి న్యూస్ ప్రజెంటర్.. మంగ్లీ పేర్లు
, శుక్రవారం, 12 ఫిబ్రవరి 2021 (20:02 IST)
తెలుగు బుల్లితెరపై బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్‌బాస్ 5కు సంబంధించిన ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఏప్రిల్ లేదా మేలో ఐదో సీజన్‌ని ప్రారంభించాలనుకుంటోన్న నిర్వాహకులు.. ఇప్పటికే పనులను ప్రారంభించినట్లు సమాచారం. ఈ క్రమంలో హోస్ట్‌గా మరోసారి నాగార్జునను ఖరారు చేసుకున్న వారు ప్రస్తుతం కంటెస్టెంట్‌ల కోసం సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. 
 
కరోనా నేపథ్యంలో గత సీజన్‌లో ఎక్కువగా యాంకర్లు, యూట్యూబర్లను తీసుకోగా.. ఈసారి వారితో పాటు పలువురు సినిమా వాళ్లు కూడా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే బాగా పాపులారిటీ సంపాదించుకున్న వారిని తీసుకోబోతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో యాంకర్ రవి, హైపర్ ఆది, టిక్ టాక్ దుర్గారావు, యాంకర్ వర్షిణి, టిక్ టాకర్ దీపికా పిల్లి, యూట్యూబర్ షణ్ముఖ్, సింగర్ మంగ్లీ ఇలా పలువురి పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. 
 
ఇక తాజాగా న్యూస్ ప్రజెంటర్ స్వర్ణ రోజా పేరు వినిపిస్తోంది. ప్రస్తుతం హెచ్ఎంటీవీలో న్యూస్ ప్రజెంటర్‌గా పనిచేస్తోన్న రోజాకు మంచి ఫాలోయింగ్ ఉంది. ఇక బిగ్‌బాస్‌లో గత సీజన్‌లలో కొంతమంది న్యూస్ రిపోర్టర్‌లు, ప్రజెంటర్‌లు పాల్గొన్నారు. ఈ క్రమంలో ఈ ఏడాది ఉండబోయే బిగ్‌బాస్ ఐదో సీజన్ కోసం రోజాను తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పాపులర్ సీరియల్ నుంచి తప్పుకున్న రాధిక, ఏమైందంటే?