Webdunia - Bharat's app for daily news and videos

Install App

200 మంది ఐటీ ఉద్యోగుల్ని రోడ్డున పడేసిన వెరిజాన్, ఉద్యోగులు గగ్గోలు...

సాప్ట్వేర్ ఉద్యోగం ఇదివరకు ఓ బంగారు కలల సౌధంలా కనిపించేది. ఇప్పుడు అదే ఉద్యోగంలో చేసేవారు చాలామంది బిక్కుబిక్కుమంటున్నారు. ఐటీ రంగంలో పోటీ ఎక్కువ కావడం ఒకవైపు, నానాటికీ ఈ కోర్సులను చేసేవారు ఎక్కువ సంఖ్యలో వుండటంతో పరిస్థితి దిగజారుతోంది. మాదాపూర్‌ ఐట

Webdunia
శుక్రవారం, 5 జనవరి 2018 (21:20 IST)
సాప్ట్వేర్ ఉద్యోగం ఇదివరకు ఓ బంగారు కలల సౌధంలా కనిపించేది. ఇప్పుడు అదే ఉద్యోగంలో చేసేవారు చాలామంది బిక్కుబిక్కుమంటున్నారు. ఐటీ రంగంలో పోటీ ఎక్కువ కావడం ఒకవైపు, నానాటికీ ఈ కోర్సులను చేసేవారు ఎక్కువ సంఖ్యలో వుండటంతో పరిస్థితి దిగజారుతోంది. మాదాపూర్‌ ఐటీ కారిడార్‌లో ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీ నిర్వాకానికి 200 మంది ఉద్యోగులు రోడ్డున పడ్డారు. వీరితో సదరు కంపెనీ బలవంతంగా సంతకాలు చేయించి రాజీనామా చేయించినట్లు ఆరోపణలు చేస్తున్నారు. 
 
వెరిజాన్‌ డాటా సర్వీసెస్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌(వీడీఎస్‌) ఈ పనికి పూనుకున్నదని పోలీసులను ఆశ్రయించారు బాధితులు. తమను ఒక్కొక్కరిని గదిలోకి పిలిపించి బలవంతంగా రాజీనామా పత్రాలపై సంతకాలు చేయించుకున్నారని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. 
 
రిజైన్ పత్రాలపై సంతకం చేయనివారి పట్ల బౌన్సర్లతో భౌతిక దాడులు చేసేందుకు సైతం వారు వెనుకాడలేదంటూ ఉద్యోగులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కనీసం తమ వస్తువులను తీసుకునేందుకు సైతం అవకాశం ఇవ్వకుండా గెంటివేశారంటూ వాపోయారు. కాగా ఐటీ ఉద్యోగులకు భద్రత కల్పించాలంటూ వారు డిమాండ్ చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దగ్గుబాటి ఫ్యామిలీకి నాంపల్లి కోర్టు భారీ షాక్

పెద్ద నటులతో నటించా, ఆత్మహత్య చేసుకునే స్థితిలో వున్నా: పావలా శ్యామల (video)

ది రైజ్ ఆఫ్ అశోక నుంచి సతీష్ నీనాసం ఫస్ట్ లుక్

టెక్నాలజీ కీలకపాత్రతో నూతన చిత్రం షూటింగ్

సంక్రాంతికి వస్తున్నాం అందరూ ఎంజాయ్ చేస్తారు: వెంకటేష్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలి కాలంలో బొంతను పూర్తిగా ముఖాన్ని కప్పేసి పడుకుంటే ఏం జరుగుతుంది?

పరోటా తింటే ఏం జరుగుతుందో తప్పక తెలుసుకోవాల్సినవి

దొండ కాయలు గురించి ఆయుర్వేదం ఏం చెబుతోంది?

సంక్రాంతి పండుగకి పోషకాలతో కూడిన కాలిఫోర్నియా బాదం వంటకం

మాంసాహారం కంటే మొలకెత్తిన తృణ ధాన్యాలు ఎంతో మేలు, నిమ్మరసం కలిపి తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments