Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అనాథాశ్రమం పేరుతో అమ్మాయిలతో కామవాంఛ తీర్చుకుంటూ...

హైదరాబాద్‌లో మరో దారుణం వెలుగు చూసింది. అనాథాశ్రమం పేరుతో అమ్మాయిలతో భిక్షాటన చేస్తూ, తన కామ కోర్కెలు తీర్చుకుంటున్న ఓ నయవంచకుడి గుట్టురట్టయింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,

Advertiesment
అనాథాశ్రమం పేరుతో అమ్మాయిలతో కామవాంఛ తీర్చుకుంటూ...
, బుధవారం, 3 జనవరి 2018 (12:00 IST)
హైదరాబాద్‌లో మరో దారుణం వెలుగు చూసింది. అనాథాశ్రమం పేరుతో అమ్మాయిలతో భిక్షాటన చేస్తూ, తన కామ కోర్కెలు తీర్చుకుంటున్న ఓ నయవంచకుడి గుట్టురట్టయింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
హైదరాబాద్, వనస్థలిపురంలోని సచివాలయనగర్‌లో గ్రేషియస్ ప్యారడైస్ పేరుతో గత కొంతకాలంగా సత్యానంద్ అనే ఓ మాజీ ప్రభుత్వ ఉద్యోగి అనాథ ఆశ్రమాన్ని నడుపుతున్నాడు. సుప్రీంకోర్టు సూచనల ప్రకారం ప్రభుత్వం నుంచి అనుమతి పొందిన తర్వాతే ఆశ్రమాలు పెట్టాల్సి ఉంటుంది. కానీ, ఆయనగారు అలాంటివేమీ లేకుండానే ఆశ్రమాన్ని నడుపుతున్నాడు. అంతేనా, ఇందులో 24 మంది అనాథ బాలికలకు చేరదీస్తున్నట్లు నటిస్తూ వారిని అందులో నిర్బంధించాడు. 
 
పైకి మాత్రం స్వచ్ఛంద సేవ సంస్థ ముసుగులో అనాథలను ఆదుకుంటున్నట్లు నాటకమాడుతూ దాతల నుంచి అందినకాడికి దండుకోవడమేకాకుండా ఆడపిల్లలకు అవసరమైన సౌకర్యాలు కూడా కల్పించకుండా ఆ ఆశ్రమాన్ని నరకకూపంగా మార్చివేశాడు. వారికి వేళకు సరైన తిండి కూడా పెట్టకుండా వారితో భిక్షాటన చేయించసాగాడు. 
 
అభంశుభం తెలియని అమ్మాయిలతో లైంగిక కోర్కెలు కూడా తీర్చుకుంటూ వచ్చాడు. ఈ విషయం బయటకు పొక్కి... జిల్లా బాలల సంరక్షణ శాఖ అధికారులకు చేరింది. దీంతో పోలీసుల సహకారంతో ఆశ్రమంపై దాడి చేసి 24 మంది ఆడపిల్లలను ఆ చెర నుంచి విముక్తి కల్పించారు. వీరందరనీ ప్రభుత్వ వసతి గృహానికి తరలించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పైలట్ గర్ల్ ఫ్రెండ్‌కి ఎలా ప్రపోజ్ చేశాడో చూడండి