గజల్ శ్రీనివాస్‌కు ఈ నెల 12వరకు జ్యుడిషియల్ రిమాండ్
ఆధ్యాత్మికత, దేశభక్తి, మహిళల భద్రత తదితర అంశాలపై ఎన్నో కళారూపాలు చేసిన గాయకుడు గజల్ శ్రీనివాస్ లైంగికవేధింపుల కేసులో అరెస్టు కావడం తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. ఆలయవాణి అనే గజల్ శ్రీనివాస్
ఆధ్యాత్మికత, దేశభక్తి, మహిళల భద్రత తదితర అంశాలపై ఎన్నో కళారూపాలు చేసిన గాయకుడు గజల్ శ్రీనివాస్ లైంగికవేధింపుల కేసులో అరెస్టు కావడం తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. ఆలయవాణి అనే గజల్ శ్రీనివాస్ వెబ్ రేడియోలో జాకీగా పనిచేసే బాధితురాలు డిసెంబర్ 29న పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఈ ఫిర్యాదులో మసాజ్ చేయమన్న గజల్ శ్రీనివాస్.. నగ్నంగా వుండాలని ఒత్తిడి చేసినట్లు బాధితురాలు ఆరోపించింది. ఇంకా గజల్ శ్రీనివాస్ లైంగికంగా వేధింపులకు గురిచేసినట్లు బాధితురాలు ఫిర్యాదు చేసింది. చెప్పినట్లు చేయకపోతే ఉద్యోగం నుంచి తీసేస్తానంటూ బెదిరించారని బాధితురాలు తెలిపింది.
కేసుకు సంబంధించి వీడియోలు, ఆడియోలు వంటి పూర్తి ఆధారాలతోనే బాధితురాలు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. పక్కా ఆధారాలు వుండటంతోనే గజల్‌ను అరెస్ట్ చేశామని పోలీసులు చెప్తున్నారు. ఇకపోతే, గజల్‌ను కోర్టు ముందు హాజరు పరచారు. గజల్‌కు ఈ నెల 12వరకు కోర్టు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. మరోవైపు గజల్ శ్రీనివాస్ తరఫు న్యాయవాది బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై మరి కాసేపట్లో కోర్టులో వాదనలు జరగనున్నట్లు సమాచారం.