కరోనా మూడో వేవ్ పిల్లలపై ప్రభావం చూపనుంది, అన్ని విధాలా సిద్ధంగా ఉందాం: ఎంపీ రేవంత్ రెడ్డి

Webdunia
మంగళవారం, 18 మే 2021 (18:57 IST)
కరోనా మూడో వేవ్ పిల్లలపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉందని, వైద్య నిపుణులు, శాస్త్రవేత్తలు ఇప్పటికే ఈ విషయంలో హెచ్చరిస్తున్నారని, ఇప్పటి నుంచే అన్ని రకాల ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు, ఎంపీ రేవంత్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. 
 
మంగళవారం నాడు ఈ విషయమై ఆయన ఒక ట్వీట్ చేశారు. దేశంలో మూడో కరోనో వేవ్ విషయంలో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా దేశంలో పిల్లల తల్లి తండ్రులకు వెంటనే కరోనో వాక్సిన్స్ టీకాలు వేయించాలని, పిల్లల వ్యాధులకు సంబంధించిన మందుల ఉత్పత్తులను గణనీయంగా పెంచి అన్ని రకాల మందుల కొరత లేకుండా చూడాలని ఆయన సూచించారు. 
 
అలాగే దేశంలో వైద్య సిబ్బందిని సరిపోయేంతగా పెంచాలని, నర్సింగ్ సిబ్బందిని పెంచి వారికి సరైన శిక్షణ, నైపుణ్యం ఇవ్వాలని ఇది ఈ సమయంలో అత్యంత కీలకమైన విషయమని అన్నారు. 
 
మూడో వేవ్ పిల్లల మీద ప్రభావం చూపుతుందని భయాందోళన ఉన్న నేపత్యంలో అన్ని రకాలుగా మనం సిద్ధంగా ఉండాలని, మన భవిష్యత్ తరాలను రక్షించుకోవడం చాలా ముఖ్యమని అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Raviteja: రవితేజ, డింపుల్ హయతి.. భర్త మహాశయులకు విజ్ఞప్తి నుంచి మెలోడీ సాంగ్

ఎవరు కొత్త తరహా సినిమా చేసినా ప్రోత్సాహించాలి, లేకుంటే ముందడుగు వేయలేరు : కార్తి

మాకు మనవళ్ళు పుట్టినా నాగార్జున అలానే ఉన్నారు.. యాంటీ ఏజింగ్ టెస్టులు చేయాలి...

విదు, ప్రీతి అస్రాని మ‌ధ్య కెమిస్ట్రీ 29 సినిమాకు ప్ర‌ధానాక‌ర్ష‌ణ

మగాళ్లను మొక్కు కుంటూ కాదు తొక్కు కుంటూ పోతం.. పురుష కొత్త పోస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సీజనల్ ఫ్రూట్ రేగు పండ్లు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఫ్యాషన్‌ను ప్రముఖమైనదిగా నడిపించే బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్

అధునాతన క్యాన్సర్ చికిత్సకై టాటా మెమోరియల్ ఎసిటిఆర్ఇసితో కోటక్ మహీంద్రా భాగస్వామ్యం

winter health, తులసి పొడిని తేనెలో కలిపి తాగితే...

పది లక్షల మంది పిల్లల్లో ప్రకటనల అక్షరాస్యతను పెంపొందించే లక్ష్యం

తర్వాతి కథనం
Show comments