Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

హైదరాబాద్ ఎఆర్ మహిళ కానిస్టేబుల్ హనీ ట్రాప్, ఒకరి తర్వాత ఒకర్ని...

Advertiesment
హైదరాబాద్ ఎఆర్ మహిళ కానిస్టేబుల్ హనీ ట్రాప్, ఒకరి తర్వాత ఒకర్ని...
, మంగళవారం, 18 మే 2021 (16:25 IST)
డబ్బులు ఉన్నవారిని ట్రాప్ చేసి ప్రేమ పేరుతో డబ్బులు దండుకుంటోంది మహిళా కానిస్టేబుల్. పోలీస్ డిపార్ట్మెంట్ పేరు చెప్పుకొని బెదిరిస్తున్న ఆ రాణి ఏఆర్ హెడ్ క్వార్టర్స్‌లో కానిస్టేబుల్‌గా డ్యూటీ నిర్వహిస్తోంది.
 
గతంలో ముగ్గురిని పెళ్లి చేసుకొని విడాకులు ఇచ్చింది లేడీ కానిస్టేబుల్. ఇద్దరికి డివోర్స్ ఇవ్వగా మరొకరు ఈ కానిస్టేబుల్ వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకున్నాడు. తాజాగా షాబాద్ మండలం హైతబాద్‌కు చెందిన చరణ్ తేజను ట్రాప్ చేసింది కానిస్టేబుల్.
 
ఉద్యోగ రీత్యా హైదరాబాద్ వచ్చిన చరణ్ తేజను ట్రాప్ చేసి ప్రేమ పేరుతో వచించి పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేసింది. తనను పెళ్లి చేసుకోక పోతే ST SC అట్రాసిటీ కేసు పెడతానని లేకపోతే కలిసి తిరిగిన ఫోటోలు వీడియోస్ బయటపెడ్తానాన్ని బెదిరింపులకు దిగింది.
 
గత వివాహాలు విషయం తెలియకుండా చరణ్‌ను నమ్మించి పెళ్లి చేసుకున్న కానిస్టేబుల్ రాణి ట్రాప్ నుండి తనను రక్షించండి అంటూ శంషాబాద్ డిసిపి, షాబాద్ పోలీస్ స్టేషన్, సోషల్ మీడియా నంబర్‌లకు ఆన్లైన్ ద్వారా ఫిర్యాదు చేశాడు తేజ. 
webdunia
ఒంటరిగా ఉన్న అబ్బాయిలను ట్రాప్ చేసి బ్లాక్‌మెయిల్ చేస్తూ డబ్బులు దండుకుంటుందంటూ పిర్యాదులో పొందుపరిచిన బాధితుడు. ఆ రాణి భాదితులు ఎవరైనా ఉంటే ముందుకురావాలని ప్రాధేయపడ్డాడు భాదితుడు.
 
కాగా గతంలో రాణి వరస పెళ్లిళ్లపై జూబ్లీహిల్స్ పీఎస్‌లో ఆమె తల్లిదండ్రులే ఆమెపై పిర్యాదు చేశారు. పోలీస్ ఉద్యోగం అని భయపడకుండా ఇష్టం వొచ్చిన వారితో తిరుగుతుందని తల్లితండ్రుల స్టేట్మెంట్ ఇచ్చారు.
 
ట్రాప్ చేసిన వారిని తన ఇంట్లో కాకుండా సెపరేట్ రూమ్ తీసుకొని బాధితులతో గడుపుతున్నట్లు తేలింది. ఈమెను డిపార్ట్మెంట్ నుండి సస్పెండ్ చేసి ఆమె ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని భాదితుడు డిమాండ్ చేస్తున్నాడు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కరోనాకు డాక్టర్ అగర్వాల్ మృతి... దేశ వ్యాప్తంగా 269 మంది వైద్యులు