Publish Date: Thu, 15 Apr 2021 (12:13 IST)
Updated Date: Thu, 15 Apr 2021 (12:14 IST)
హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు ధర్నాచౌక్ వద్ద వైఎస్ షర్మిల దీక్ష ప్రారంభమైంది. తెలంగాణలో ఖాళీగా ఉన్న 1.91 లక్షల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయాలని ఆమె డిమాండ్ చేస్తున్నారు.
ఆమె ఈ దీక్షను 72 గంటల పాటు నిర్వహించాలని భావించడగా ఈ రోజు సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే నిర్వహించుకోవడానికి పోలీసులు అనుమతి ఇచ్చారు. ఆమె ఎప్పటివరకు దీక్ష చేస్తారన్న విషయంపై సందిగ్ధత నెలకొంది. నిరుద్యోగుల కోసం దీక్ష చేస్తానని ఇటీవల నిర్వహించిన ఖమ్మం సభలో షర్మిల ప్రకటించిన విషయం విదితమే.
కాగా, ఇటీవల నల్గొండ వేదికగా జరిగిన బహిరంగ సభలో తన దీక్షా విషయాన్ని ప్రకటించారు. ఆ సభలో ఆమె ముఖ్యమంత్రి కేసీఆర్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.