Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Sunday, 13 April 2025
webdunia

టీఆర్‌ఎస్‌కు సీనియర్ నేత గుడ్ బై...వైయస్ షర్మిలతో భేటి

Advertiesment
Good bye
, సోమవారం, 22 ఫిబ్రవరి 2021 (14:02 IST)
టీఆర్‌ఎస్‌ పార్టీకి, రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ డైరెక్టర్‌ పదవికి రాజీనామా చేస్తున్నట్లు రాజేంద్రనగర్‌ సర్కిల్‌ బుద్వేల్‌కు చెందిన టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకుడు కె.ఎస్‌. దయానంద్‌(డేవిడ్‌) ఓ ప్రకటనలో తెలిపారు.
 
తన రాజీనామా లేఖను రాజేంద్రనగర్‌ ఎమ్మెల్యే టి.ప్రకాశ్‌గౌడ్‌కు, రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ పాండురంగారెడ్డికి పంపించానన్నారు.
 
అనంతరం ఆయన అనుచరులతో కలిసి లోటస్‌ పాండ్‌లో త్వరలో పార్టీ పెట్టనున్న షర్మిలతో సమావేశమై ఆమెకు మద్దతు ప్రకటించానని తెలిపారు.
 
షర్మిలకు మద్దతు ఇచ్చిన వారిలో మాజీ కార్పొరేటర్‌ కోరని శ్రీలత భర్త కోరని మహాత్మా, రాజేంద్రనగర్‌ డివిజన్‌ ఎస్సీ సెల్‌ అధ్యక్షుడు పంబాల రాజేశ్‌, డివిజన్‌ ప్రధాన కార్యదర్శి కోరని ఉదయ్‌ కిరణ్‌, తదితరులు ఉన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఉలుందూరు పేట లో శ్రీవారి ఆలయ నిర్మాణం వైభవంగా భూమి పూజ