Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మరో టిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్‌

Advertiesment
మరో టిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్‌
, బుధవారం, 23 డిశెంబరు 2020 (12:34 IST)
తెలంగాణలో మరో టిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కరోనా బారిన పడ్డారు. రాజేంద్రనగర్‌ ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్‌ కు కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. గత రెండు రోజులుగా నీరసంగా ఉండటంతో కరోనా నిర్ధారణ పరీక్ష చేయించుకోగా పాజిటివ్‌గా తేలిందని ఎమ్మెల్యే తెలిపారు.

గత నాలుగు రోజులుగా తనతో సన్నిహితంగా ఉన్నవారు వెంటనే కోవిడ్‌ పరీక్ష చేయించుకుని హోం క్వారంటైన్‌లో ఉండాలని ఎమ్మెల్యే సూచించారు.

కరోనా చికిత్స చేయించుకుంటున్న కారణంగా కొన్ని రోజుల వరకు తనను పరామర్శించడానికి ఎవరు ఫోన్‌ చేయొద్దని, అలాగే కలవటానికి కూడా ప్రయత్నించవద్దని ప్రజలకు ప్రకాష్‌గౌడ్‌ విజ్ఞప్తి చేశారు. భగవంతుడు, ప్రజల ఆశీస్సులతో త్వరలోనే కోలుకుని ప్రజల ముందుకు వస్తానని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

రెండో విడత కాస్తా తగ్గినప్పటికీ అనిపించినా మళ్లీ కరోనా తీవ్ర రూపం దాలుస్తోంది. రాష్ట్రంలో ఇప్పటికే పదుల సంఖ్యలో టిఆర్‌ఎస్‌ ప్రజా ప్రతినిధులు కరోనా వైరస్‌ బారినపడ్డారు. దీంతో ప్రజలు, నాయకులు ఆందోళన చెందుతున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆ పుకార్లు వ్యాక్సిన్ విక్రయాలకోసమా?!