Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

గాంధీ ఆస్పత్రిలో 15 గంటల్లో.. 35 మంది మృతి

Advertiesment
గాంధీ ఆస్పత్రిలో 15 గంటల్లో.. 35 మంది మృతి
, గురువారం, 15 ఏప్రియల్ 2021 (14:33 IST)
కొవిడ్‌ రోగులకు చికిత్స అందిస్తున్న గాంధీ ఆస్పత్రిలో సోమవారం రాత్రి 10 గంటల నుంచి మంగళవారం మధ్యాహ్నం ఒంటిగంట సమయానికి.. అంటే కేవలం 15 గంటల వ్యవధిలో 35 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇంకా మరెందరో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నట్టు సమాచారం. 
 
కరోనా వైరస్‌ పాజిటివ్‌ వచ్చినా తమకేమీ కాదనే ధీమాతో నిర్లక్ష్యం చేసి.. పరిస్థితి విషమించాక చివరి నిమిషంలో ఆస్పత్రిలో చేరడమే ఇందుకు కారణమని వైద్యులు చెబుతున్నారు. మరికొందరేమో.. ప్రైవేటు ఆస్పత్రుల్లో లక్షలు ఖర్చు చేసి, చికిత్స చేయించుకుని వెంటిలేటర్‌పై ఉన్న సమయంలో గాంధీ ఆస్పత్రికి వస్తున్నారు. 
 
దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారు కరోనాతో వస్తే కొన్ని ఆస్పత్రులు చేర్చుకోవట్లేదు. ఇలా అన్ని ఆస్పత్రులూ తిరిగి.. చివరికి గాంధీ ఆస్పత్రికి వస్తున్నవారు ఎక్కువగానే ఉన్నారు. ఇలాంటి కారణాలేవైనాగానీ.. గాంధీ ఆస్పత్రిలో కరోనా మరణమృదంగం వినిపిస్తోంది. 
 
కాగా.. సోమవారం రాత్రి నుంచి మంగళవారం మధ్యాహ్నం వరకూ (15గంటల్లో) చనిపోయిన 35 మందిలో 45, ఆలోపు వయసువారు తొమ్మిది మంది ఉండడం గమనార్హం. మిగతావారంతా 46 నుంచి 83 ఏళ్ల వారు. ఈ 35 మందిలో 16 మంది మహిళలు కాగా, 19 మంది  పురుషులు. కాగా, ప్రస్తుతం గాంధీలో 308 మంది కొవిడ్‌ రోగులు చికిత్స పొందుతున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తెలంగాణాలో ఉధృతంగా సెకండ్ వేవ్ : నైట్ కర్ఫ్యూకు మొగ్గు?