ఈ దశాబ్దంలోనే అత్యంత చలి రోజుగా శనివారం రికార్డు

Webdunia
ఆదివారం, 19 డిశెంబరు 2021 (09:06 IST)
తెలంగాణ రాష్ట్ర ప్రజలు చలితో గజగజ వణికిపోతున్నారు. రాత్రి ఉష్ణోగ్రతలు బాగా పడిపోతున్నాయి. దీంతో చలి తీవ్రత అధికమైంది. ఈ నేపథ్యంలో శనివారం హైదరాబాద్ నగరంలోనే అత్యంత చలిరోజుగా నమోదైంది. 
 
గచ్చిబౌలిలోని సెంట్రల్ యూనివర్శిటీలో శనివారం ఉదయం అత్యల్పంగా 8.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అలాగే, పటాన్‌చెరులో 8.4 డిగ్రీలు, రాజేంద్ర నగర్‌లో 9.1 డిగ్రీలు చొప్పున కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 
 
అలాగే, శుక్రవారం రాత్రి సంగారెడ్డి జిల్లా కోహిర్‌లో అత్యల్పంగా 6.5 డిగ్రీలు, మెయినాబాద్‌ మండలం రెడ్డిపల్లిలో 7.1 డిగ్రీలు, జహీరాబాద్‌ మండలం, సత్వార్ గ్రామంలో 7.3 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డు అయినట్టు అధికారులు వెల్లడించారు. 
 
గతంలో 2015 సంవత్సరం డిసెంబరు 13వ తేదీన హైదరాబాద్ నగరంలో అతి తక్కువగా 9.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఆ తర్వాత ఇంతకాలానికి మరోమారు అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైంది. అలాగే, వచ్చే మూడు రోజుల్లో సాధారణ ఉష్ణోగ్రత కంటే 2 నుంచి 4 డిగ్రీల తక్కువగా నమోదవుతుందని హైదరాబాద్ నగర ప్రాంతీయ వాతావరణ కేంద్ర అధికారులు వెల్లడించారు. 
 
అంతేకాకుండా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పగటిపూట ఉష్ణోగ్రతలు పడిపోడుతుండటంతో వాతావరణ శాఖ ఆరెంజ్ అలెర్ట్‌ను ప్రకటించింది. ఆదిలాబాద్, అసిఫాబాద్, సిరిసిల్ల, జగిత్యాల, మహబూబాబాద్ జిల్లాల్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అందువల్ల చిన్నారుల విషయంలో తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలని కోరారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nandamuri Kalyan: ఛాంపియన్ తో 35 ఏళ్ల తర్వాత నందమూరి కళ్యాణ్ చక్రవర్తి రీఎంట్రీ

మంత్రి సీతక్క లాంచ్ చేసిన కామాఖ్య ఇంటెన్స్ థ్రిల్లింగ్ ఫస్ట్ లుక్

ఘంటసాల ది గ్రేట్ మూవీ మరో శంకరాభరణం అవుతుందన్న ప్రముఖులు

నేను నమ్మితే షూటింగ్ కు కూడా ఎప్పుడో గానీ వెళ్లను : నిర్మాత కేఎల్ దామోదర ప్రసాద్

Akhil Akkineni : ప్రశాంత్ నీల్ తో అఖిల్ అక్కినేని చిత్రం ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

Black Salt: నల్ల ఉప్పును తీసుకుంటే మహిళలకు ఏంటి లాభం?

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

భార్యాభర్తల కోసం ఈ చిట్కాలు..

తర్వాతి కథనం
Show comments