Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఢిల్లీలో మళ్లీ తెరుచుకోనున్న పాఠశాలలు-డిసెంబర్ 27 నుంచి ప్రారంభం

Advertiesment
ఢిల్లీలో మళ్లీ తెరుచుకోనున్న పాఠశాలలు-డిసెంబర్ 27 నుంచి ప్రారంభం
, శనివారం, 18 డిశెంబరు 2021 (14:19 IST)
దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్య స్థాయి పెరిగినప్పటికీ ఢిల్లీ సర్కారు భౌతిక తరగతులు నిర్వహిస్తుండటంపై సుప్రీంకోర్టు ఆదేశాల అనంతరం.. డిసెంబర్ 3న ఢిల్లీలో మూతబడ్డాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. 
 
కాలుష్యం కారణంగా మూతపడిన స్కూళ్లను తక్షణమే తెరిచేందుకు సిద్ధపడింది. కోవిడ్ వేరియంట్ ఒమిక్రాన్ విజృంభణ వేళ ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లోని ఆరవ తరగతి ఆపై తరగతుల విద్యార్థులకు, కళాశాలలు, ఇతర విద్యా సంస్థలు తెరిచేందుకు నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం తక్షణమే అమలులోకి వచ్చేలా భౌతిక తరగతులను పునఃప్రారంభించేందుకు అధికారిక నోటిసు ద్వారా అధికారులకు అనుమతిచ్చింది. 
 
కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ (సీఎక్యూఎం)తో సంప్రదించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు. ఐదో తరగతి వరకు విద్యార్థులకు ఫిజికల్ క్లాసులు డిసెంబర్ 27 నుంచి ప్రారంభం కావొచ్చునని  కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి తెలిపింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పీఆర్సీ తేల్చేందుకు కాస్త ఆగాలన్న సజ్జల