Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిన్నారి హత్యాచారం: చిన్నారి కుటుంబాన్ని పరామర్శించిన పవన్ కళ్యాణ్

Webdunia
బుధవారం, 15 సెప్టెంబరు 2021 (18:42 IST)
హైదరాబాదులోని సైదాబాద్ సింగరేణి కాలనీలో దారుణ హత్యకు గురైన ఆరేళ్ళ చిన్నారి కుటుంబాన్ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పరామర్శించారు. స్వయంగా ఆయన వారి ఇంటికి చేరుకుని.. కుటుంబ సభ్యులను ఓదార్చారు. 

 
రాజు అనే కామాంధుడు ఆరేళ్ళ చిన్నారిని అత్యాచారం చేసి, ఆపై హత్య చేసి పారిపోవడం తెలిసిందే. అతని ఆచూకీ కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. పైగా, అతన్ని పట్టిస్తే రూ.10 లక్షల నగదు బహుమతి కూడా ఇస్తామని ప్రకటించారు. అయినప్పటికీ అతని ఆచూకీ ఇంతవరకు తెలియలేదు. 

 
ఈ పరిస్థితుల్లో చిన్నారి కుటుంబాన్ని పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు పరామర్శిస్తున్నారు. మంగళవారం సినీ నటుడు మంచు మనోజ్ కూడా సైదాబాద్ చిన్నారి కుటుంబాన్ని పరామర్శించారు. అలాగే, ఎమ్మెల్యే సీతక్క కూడా చిన్నారి తల్లిని ఓదార్చారు. 

ఇపుడు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌తో పాటు.. అటు వైఎస్సార్ టీపీ చీఫ్ వైఎస్ షర్మిల కూడా చిన్నారి కుటుంబాన్ని పరామర్శించనున్నారు.

 
మరోవైపు, రాజును అరెస్టు చేసి ఎన్‌కౌంటర్ చేయాలన్న డిమాండ్ వినిపిస్తోంది. నిందితుడు రాజును తప్పనిసరిగా పట్టుకుని ఎన్‌కౌంటర్ చేస్తామని మంత్రి మల్లారెడ్డి మంగళవారంనాడు సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బెనెగల్ చిత్రాలు భారత సంస్కృతి సంపద : చిరంజీవి

బెంగాలీ దర్శకుడు శ్యామ్ బెనెగల్ కన్నుమూత

Peelings: పీలింగ్స్ పాటలో అల్లు అర్జున్ ఎత్తుకుంటే భయమేసింది.. అసౌకర్యంగా?

అల్లు అర్జున్ ఇష్యూకు చిరంజీవి సీరియస్ - రేవంత్ రెడ్డి పీఠానికి ఎసరు కానుందా?

బాలకృష్ణ కెరీర్ లో గుర్తుండిపోయే చిత్రం డాకు మహారాజ్ : చిత్ర దర్శక నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Palmyra Sprout తేగలు తింటే ఏమవుతుంది?

ఏ పాత్రల్లోని వంట ఆరోగ్యానికి మంచిది? ఏవి మంచివి కావు?

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

హైదరాబాద్ లోని నాగోల్‌లో రిలయన్స్ రిటైల్ ‘యూస్టా’ సరికొత్త స్టోర్ ప్రారంభం

పాలు తాగితే 8 ప్రయోజనాలు, ఏమిటి?

తర్వాతి కథనం
Show comments