Webdunia - Bharat's app for daily news and videos

Install App

టికెట్ రాకపోతే మహిళ హారతి పళ్లాల్లో పెట్రోల్ పోయిస్తావా ఓదేలూ... ప్రాణాలు తీస్తావా?

అసెంబ్లీ సీటు రాలేదని నిరసన గళం వినిపిస్తున్న చెన్నూర్‌ మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలుకు యశోద ఆస్పత్రిలో ఊహించని ఘటన ఎదురైంది. ఇందారం బాధితులను పరామర్శించడానికి వచ్చిన ఓదేలును బాధితుల బంధువులు గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. నీకు టికెట్ రాకపోతే కార్యకర

Webdunia
గురువారం, 13 సెప్టెంబరు 2018 (20:09 IST)
అసెంబ్లీ సీటు రాలేదని నిరసన గళం వినిపిస్తున్న చెన్నూర్‌ మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలుకు యశోద ఆస్పత్రిలో ఊహించని ఘటన ఎదురైంది. ఇందారం బాధితులను పరామర్శించడానికి వచ్చిన ఓదేలును బాధితుల బంధువులు గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. నీకు టికెట్ రాకపోతే  కార్యకర్తల జీవితాలతో ఆడుకుంటావా, ప్రాణాలు తీస్తావా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో నిర్ఘాంతపోయిన ఓదేలు చేసేదేమిలేక ఆసుపత్రి నుండి వెనుదిరిగారు. 
 
బాల్క సుమన్‌కు చెన్నూర్‌ టీఆర్‌ఎస్‌ టికెట్టు కేటాయించడంతో ఎన్నికల ప్రచారం ప్రారంభించడానికి వచ్చిన బాల్క సుమన్‌‌కు మహిళలు హారతి పడుతున్నారు. అదే సమయంలో పెట్రోల్‌ సీసాతో వచ్చిన గట్టయ్య బాల్కసుమన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నాడు. అక్కడ జనం గూమిగూడి ఉండటం చిన్న తొక్కిసలాడ జరిగి పెట్రోల్ మహిళల చేతుల్లోని హారతులపై పడటంతో ఒక్కసారిగా మంటలు చెలరేగి నలుగురుకి గాయాలు అయ్యాయి. 
 
గాయపడ్డవారిని హైదరాబాద్ తరలించి యశోద ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓదేలు బాధితులు పరామర్శించడానికి యశోద ఆసుపత్రికి రావడంతో బంధువుల ఘోరవ్ చేశారు. మరి తాజా ఈ ఘటన ఎటువైపునకు దారితీస్తుందో చూడాలి. నిరసనలు కాస్తా ఓదేలుకు కొత్త చిక్కులు తెచ్చిపెట్టేటట్టు ఉన్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మౌత్ పబ్లిసిటీ పై నమ్మకంతో చౌర్య పాఠం విడుదల చేస్తున్నాం : త్రినాథరావు నక్కిన

జూ.ఎన్టీఆర్ ధరించిన షర్టు ధర రూ.85 వేలా?

సైన్స్ ఫిక్షన్ యాక్షన్ చిత్రంగా కిచ్చా సుదీప్ తో బిల్లా రంగ బాషా ప్రారంభం

తన ముందే బట్టలు మార్చుకోవాలని ఆ హీరో ఇబ్బందిపెట్టేవాడు : విన్సీ అలోషియస్

Shivaraj Kumar: కేన్సర్ వచ్చినా షూటింగ్ చేసిన శివరాజ్ కుమార్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

ఇంగ్లీష్ టీచింగ్ పద్ధతి అదుర్స్.. ఆ టీచర్ ఎవరు..? (video)

తర్వాతి కథనం
Show comments