నా ఫోటోకు దండ వేయాల్సింది.. ఆమె ఫోటోకు దండేస్తానని అనుకోలేదు : శ్రీదేవి పిన్ని

నేను చనిపోతే నా ఫోటోకు శ్రీదేవి దండ వేస్తుందని అనుకున్నా కానీ... ఆమె ఫోటోకు నేను దండ వేస్తానని కలలో కూడా ఊహించలేదని బోరున విలపిస్తూ అంటోంది శ్రీదేవి పిన్ని అనసూయమ్మ. శ్రీదేవికి కూడా మరణం ఉంటుందా? అని

సోమవారం, 26 ఫిబ్రవరి 2018 (15:37 IST)
నేను చనిపోతే నా ఫోటోకు శ్రీదేవి దండ వేస్తుందని అనుకున్నా కానీ... ఆమె ఫోటోకు నేను దండ వేస్తానని కలలో కూడా ఊహించలేదని బోరున విలపిస్తూ అంటోంది శ్రీదేవి పిన్ని అనసూయమ్మ. శ్రీదేవికి కూడా మరణం ఉంటుందా? అని ఆమె వింతగా ప్రశ్నిస్తున్నారు. 
 
మా మధ్య తిరిగే శ్రీదేవి ఇక లేరన్న విషయాన్ని అస్సలు జీర్ణించుకోలేకపోతున్నానని చెప్పారామె. చిన్నతనం నుంచి తన చేతిలో పెరిగిన శ్రీదేవి 54 సంవత్సరాలకే మరణించడం బాధాకరమంటూ కన్నీంటి పర్యాంతమయ్యారు. 
 
ఆరోగ్యంగా ఉన్న శ్రీదేవికి గుండెపోటు వస్తుందని అస్సలు అనుకోవడం లేదని చెబుతున్నారు. శ్రీదేవి మరణాన్ని టీవీల్లో చూస్తూ తీవ్రంగా కన్నీంటి పర్యాంతమైన ఆమె పిన్ని, బంధువులు ముంబైకి బయలుదేరి శ్రీదేవి అంత్యక్రియలకు హాజరయ్యారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు

తర్వాతి కథనం గుండెపోటు వల్లే శ్రీదేవి మరణించారు... తేల్చిన ఫోరెన్సిక్ రిపోర్టు