Webdunia - Bharat's app for daily news and videos

Install App

సోషల్ మీడియా యాప్స్ పైన కేసు నమోదు

Webdunia
గురువారం, 27 ఫిబ్రవరి 2020 (15:20 IST)
దేశంలో తొలిసారిగా ప్రధాన సోషల్ మీడియా యాప్ లైన వాట్సాప్, ట్విట్టర్, టిక్ టాక్ లపై క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు 14 వ అదనపు చీఫ్ మెట్రోపాలిటిన్ మేజిస్ట్రేట్ సైబర్ క్రైమ్ పోలీసులకు కేసు నమోదు చేయమని ఆర్డర్స్ జారీ చేశారు. కోర్టు ఉత్తర్వుల ప్రకారం హైదరాబాద్ సిసియస్ లోని సైబర్ క్రైం పోలీసులు ఎఫ్ఐఆర్ నెంబర్ 374/2020 నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.
 
వివరాలు ఇలా ఉన్నాయి. సీనియర్ జర్నలిస్ట్ సిల్వేరి శ్రీశైలం సదరు యాప్స్ పైన ఫిర్యాదు చేశారు. ఆ మేరకు కోర్టు స్పందించి, తక్షణ విచారణ ఉత్తర్యులు జరిచేసారు. గత సంవత్సరం డిసెంబర్ 12న భారత పార్లమెంటులో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా సదరు సోషల్ మీడియా యాప్స్ శాసనాన్ని ధిక్కరిస్తూ దేశ వ్యతిరేక ప్రచారాన్ని విస్తృతoగా చేస్తున్నాయని శ్రీశైలం తొలుత హైదరాబాద్ నగర పోలీస్ స్పెషల్ బ్రాంచ్ జాయింట్ కమీషనర్ మహంతిని కలసి ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోవడంతో కోర్టును ఆశ్రయించారు. 
 
సోషల్ మీడియా గ్రూప్స్‌లో సున్నితమైన మతపరమైన అంశాలను రెచ్చగొడుతు, దేశ వ్యతిరేక కార్యక్రమాలకు సోషల్ మీడియా యాప్ లైన వాట్సాప్, ట్విట్టర్, టిక్ టాక్‌లు వేదిక అవుతున్నాయని శ్రీశైలం తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇందుకు తార్కాణంగా కొన్నివాట్సాప్, ట్విట్టర్, టిక్ టాక్ గ్రూప్‌ల వివరాలను కూడా పిర్యాదులో జత చేసారు. వీటన్నిటిని పరిశీలించిన మేజిస్ట్రేట్ సైబర్ పోలీసులకు రిఫర్ చేశారు. దీనితో దేశంలోనే మొట్టమొదటిసారిగా సోషల్ మీడియా యాప్స్ పైన కేసులు నమోదైనట్లైంది. ఈ క్రింది ఇండియన్ పినల్ కోడ్ సెక్షన్ 153A, 121 A, 124, 124 A, 294, 295 A, 505, 120 B, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం 2000, సెక్షన్ 66A క్రింద కేసులు నమోదు కాబడ్డాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినీ కార్మికులకు వేతనాలు 30 శాతం పెంచాలి : అమ్మిరాజు కానుమిల్లి

Niharika: సంప్రదాయం దుస్తులతో పెండ్లి కూతురులా ముస్తాబయిన నీహారిక కొణిదల

ఒక్క కూలీ కోసం యుద్ధమే జరుగుతోందని చెప్పే రజనీకాంత్ కూలీ ట్రైలర్

అర్జున్ రెడ్డి టైంలోనే సుకుమార్ తో సినిమా అనుకున్నాం : విజయ్ దేవరకొండ

ఫ్యామిలీ ఎమోషన్స్, ఎంటర్ టైన్ మెంట్ తో లిటిల్ హార్ట్స్ సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments