Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమ్మాయి కోసం ఆప్తమిత్రుడిని దారుణంగా హత్య చేశాడు, ఎక్కడ?

Webdunia
మంగళవారం, 29 అక్టోబరు 2019 (16:33 IST)
హేమంత్, సతీష్‌లు ఇద్దరూ మంచి స్నేహితులు. వరంగల్ నగరం గాంధీపురం ఏరియా వీరిది. చిన్నప్పటి నుంచి కలిసే పెరిగారు. కలిసే తిరిగారు. హేమంత్ సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా కొన్నిరోజుల పాటు బెంగుళూరులోనే స్థిరపడ్డాడు. సతీష్ మాత్రం చిన్నపాటి ఉద్యోగాలు చేసుకుంటూ సొంత ఊర్లోనే ఉండేవాడు. అయితే గత కొన్నిరోజుల ముందు దసరాకు వచ్చి హేమంత్‌ను కలిశాడు సతీష్.
 
ఇద్దరూ కలిసి సరదాగా మద్యం సేవించారు. సతీష్ చిన్నపాటి ఉద్యోగం చేయడం ఏమాత్రం ఇష్టం లేదు హేమంత్‌కి. తనతో పాటు బెంగుళూరులో పనిచేసేందుకు రమ్మని కోరాడు. సాఫ్ట్వేర్ కంపెనీలో తనకు షేర్స్ ఉన్నాయని.. తనతో పాటు వస్తే మంచి ఉద్యోగం ఇస్తానన్నాడు.
 
దీంతో సతీష్ కూడా ఒకే చెప్పాడు. పండుగ తరువాత ఇద్దరూ కలిసి బెంగుళూరుకు వెళ్ళారు. ఒకే గదిలో ఇద్దరూ ఉండేవారు. సతీష్‌కు అప్పటికే పెళ్ళయ్యింది. ఆరు నెలల క్రితం వివాహం జరిగింది. భార్య ప్రియాంక హౌస్ వైఫ్. ఉద్యోగం రావడంతో భార్యను ఇంటి దగ్గరే వదిలి సతీష్ బెంగుళూరుకు వెళ్ళాడు. ఇద్దరు స్నేహితులు ఒకే గదిని అద్దెకు తీసుకుని ఉండేవారు. వీరు పనిచేస్తున్న సంస్ధలోకి స్రవంతి అనే యువతి వచ్చి చేరింది.
 
కొత్తగా ఉద్యగంలో చేరడంతో హేమంత్ తన స్నేహితుడు సతీష్‌ను పరిచయం చేశాడు. ఆమెకు ఎలాంటి అనుమానాలు ఉన్నా సతీష్ తీర్చేవాడు. ఇలా వారిద్దరి మధ్య చనువు పెరిగింది. అది కాస్తా వివాహేతర సంబంధానికి దారితీసింది. సతీష్‌లో వస్తున్న మార్పును గమనించాడు హేమంత్. ప్రాణ స్నేహితుడు కావడంతో అతన్ని మందలించాడు. అతడికి పెళ్ళయిన విషయాన్ని గుర్తు చేశాడు. అయినా సతీష్‌లో మార్పు రాలేదు. 
 
రెండురోజుల క్రితం గదిలో ఇద్దరూ కలిసి మద్యం సేవించారు. సతీష్, హేమంత్‌లకు మధ్య ఆ అమ్మాయి విషయంపై తీవ్ర వాగ్వాదం ఏర్పడింది. దీంతో సతీష్ ఆవేశంతో వంట గదిలోని కత్తితో హేమంత్‌ను అతి దారుణంగా పొడిచి చంపేశాడు. గదిని మూసివేసి యధావిధిగా ఉద్యోగానికి వెళ్ళాడు. అయితే హేమంత్ ఫోన్లో టచ్‌లో లేకపోవడంతో అతని కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చింది. బెంగుళూరుకు వెళ్ళి గదిలో చూడగానే హత్యకు గురైన విషయాన్ని గమనించారు. పోలీసులకు సమాచారమిచ్చారు. విచారణ జరిపిన పోలీసులు స్నేహితుడే హంతకుడన్న విషయాన్ని తెలుసుకుని అతన్ని అరెస్టు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజయ్ దేవరకొండ రౌడీ వేర్ బ్రాండ్ కు ఔట్ లుక్ ఇండియా బిజినెస్ అవార్డ్

వికటకవి చూసి గర్వంగా అనిపించింది.. నిర్మాత రామ్ తాళ్లూరి

రామ్ పోతినేని సినిమాకు తమిళ సంగీత ద్వయం వివేక్ - మెర్విన్

ఉజ్జయిని మహాకాళేశ్వర్ టెంపుల్ సాక్షిగా కన్నప్ప రిలీజ్ డేట్ ప్రకటన

వెన్నెల కిషోర్ నటించిన శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ రిలీజ్ డేట్ ఫిక్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

తర్వాతి కథనం
Show comments