Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పనిచ్చిన వాడితో భార్య సరససల్లాపాలు.. దారుణంగా హత్య చేయించిన భర్త

Advertiesment
పనిచ్చిన వాడితో భార్య సరససల్లాపాలు.. దారుణంగా హత్య చేయించిన భర్త
, శనివారం, 26 అక్టోబరు 2019 (17:40 IST)
ఖమ్మం జిల్లా సుగాలి తాండా అది. తెల్లవారుజామున 5 గంటలకు గ్రామం నుంచి అరుపులు. చిన్నపిల్లల కేకలు. ఒక మహిళ మృతదేహం.. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతి చెంది ఉన్న మహిళ పేరు వనజ. స్థానికుల సహకారంతో భర్త రాజుకు సమాచారమిచ్చారు. అంతకు ముందే తన భార్య కనిపించలేదని భర్త పోలీస్టేషన్‌కు ఫిర్యాదు చేసి ఉన్నాడు. మృతదేహాన్ని పంచనామాకు పంపిన పోలీసులు విచారణ ప్రారంభించారు.
 
వనజ, రాజులకు రెండు సంవత్సరాల క్రితం వివాహమైంది. వీరికి పిల్లలు లేరు. రాజు పెళ్ళి కాక ముందు రెండు సంవత్సరాల పాటు సింగపూర్‌లో ఉండేవాడు. ఒక మధ్యవర్తిని నమ్మి అక్కడ ఇంటిలో పని మనిషిగా చేరాడు. అయితే సంపాదించిన డబ్బు మొత్తాన్ని మధ్యవర్తి తన అకౌంట్‌లోకి వేసుకుని రాజును మోసం చేసేశాడు. దీనితో సింగపూర్ నుంచి ఇండియాకు వచ్చిన రాజు పెళ్ళి చేసుకున్నాడు. అయితే కుటుంబాన్ని పోషించేందుకు ఆర్థిక పరిస్థితి సరిపోలేదు.
 
వనజ, రాజులు ఇద్దరూ కలిసి స్థానికంగా ఉన్న ఇటుక బట్టీలో చేరారు. ఇటుక బట్టీ యజమాని రాము. భార్యాభర్తలిద్దరికీ పనిచ్చాడు. అయితే రాజు భార్య వనజపై కన్నేశాడు రాము. తనకు రాజు అడ్డంగా ఉన్నాడని.. అతన్ని తన స్నేహితుడు బట్టీకి పంపించాడు. వనజను మాత్రం తన బట్టీలోనే పనిలో ఉంచుకున్నాడు.
 
రాము చెప్పిన మాయమాటలతో వనజ అతనికి దగ్గరైంది. నెలరోజుల పాటు వీరి మధ్య వివాహేతర సంబంధం కొనసాగింది. అయితే భర్తకు అసలు విషయం తెలిసిపోయింది. భార్యను మందలించాడు. పెద్దలను పిలిచి పంచాయతీ పెట్టాడు. భార్య తను మారతానని ప్రమాణం  చేసింది. మళ్ళీ ఇంటికి తీసుకెళ్ళాడు. అయితే వనజలో ఎలాంటి మార్పు రాలేదు.
 
రాము.. వనజలు ఇద్దరూ కలుస్తూనే ఉండేవారు. దీంతో రాజు తన భార్యను ఎలాగైనా చంపాలనుకున్నాడు. వనజ తమ్ముడు సురేష్‌‌కు అసలు విషయాన్ని చెప్పాడు. తన బావకు జరిగిన అన్యాయంపై సురేష్ రగిలిపోయాడు. అక్క అని కూడా చూడకుండా చంపేందుకు సిద్థమయ్యాడు. రాజు, సురేష్‌, వనజ ముగ్గురు కలిసి సినిమాకు బయలుదేరారు. మార్గమధ్యంలో మద్యాన్ని తీసుకున్నారు. తన భర్త, తమ్ముడు కావడంతో వనజకు అనుమానం రాలేదు. 
 
మద్యాన్ని తీసుకున్న తరువాత మార్గమధ్యంలో సురేష్, రాజులు మద్యం సేవించారు. కోపంతో ఊగిపోయిన సురేష్‌ బండరాయితో వనజ తలపై మోదాడు. ఆమెను దారుణంగా చంపేశాడు. అయితే హత్య జరిగినప్పుడు భర్త కూడా అక్కడే ఉన్నాడు. హత్య జరిగిన తరువాత పోలీస్టేషన్లో రాజు తన భార్య కనిపించలేదని ఫిర్యాదు చేశాడు. పోలీసుల విచారణలో భర్త, మృతురాలి తమ్ముడే ప్రధాన నిందితులుగా తెలుసుకుని వారిని అదుపులోకి తీసుకున్నారు. 
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రైతుకు సాయం లేదు.. మాజీ మంత్రి దేవినేని