సోదరి వద్దకు ట్యూషన్ కోసం వచ్చిన బాలికను బాలుడు అత్యాచారం చేశాడు. ఆ బాలుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. కానీ అత్యాచారానికి పాల్పడ్డాడని ఆరోపణలు ఎదుర్కొన్నప్పటికీ బాలుడికి 15 ఏళ్లు మాత్రమే వుండటంలో పోలీసులు అతడి వద్ద వివిధ కోణాల్లో విచారణ జరుపుతున్నారు. వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్రలోని థాణే జిల్లాలోని కల్యాణ్ టౌన్ షిప్‌లో ఓ యువతి ట్యూషన్ నిర్వహిస్తున్నది.
ఇదే ప్రాంతంలో నివాసం ఉంటున్న బాలిక యువతి ఇంటికి ట్యూషన్ చెప్పించుకోవడానికి వెళ్లింది. సమయం కోసం వేచి చూసిన 15 ఏళ్ల ట్యూషన్ చెప్పే యువతి తమ్ముడు.. బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇంటికి ఏడ్చుకుంటూ వెళ్లిన బాలికను ఆమె కుటుంబ సభ్యులు ఏం జరిగింది అని ఆరా తీశారు.
బాలిక శరీరం మీద గాయాలు ఉండటంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు బాలికను వైద్యపరీక్షలకు తరలించి కేసు నమోదు చేశారు. న్యాయస్థానం ఆదేశాలతో బాలుడిని రిమాండ్ హోమ్‌కు తరలించి కేసు విచారణ చేస్తున్నామని పోలీసులు తెలిపారు.