Webdunia - Bharat's app for daily news and videos

Install App

వదినను గదిలోకి లాక్కెళుతున్న మరిది, సడెన్‌గా అన్న రావడంతో..?

Webdunia
శుక్రవారం, 14 మే 2021 (09:30 IST)
క్షణిక సుఖాల కోసం వావివరసలు మర్చిపోతున్నారు. కామవాంఛ తీర్చుకోవడానికి సొంత కుటుంబ సభ్యులను కూడా వదిలిపెట్టడం లేదు. అలాంటి ఘటనే తెలంగాణా రాష్ట్రంలో జరిగింది. తల్లిలా భావించాల్సిన వదినపై కన్నేశాడు. ఆమెను బలవంతంగా అనుభవించాలని ప్లాన్ చేశాడు. వదినను గదిలోకి లాక్కెళుతుండగా సడెన్‌గా అన్న ప్రత్యక్షమయ్యాడు. దీంతో ఆగ్రహంతో ఊగిపోయాడు.
 
అసలే పెళ్ళయి నెలరోజులు. కరోనా సమయంలో అన్నకు పెళ్ళయ్యింది. వదిన అందంగా ఉంది. ఆమెతో బాగా కలిసిపోయాడు మరిది. సొంత బిడ్డలా, తన తమ్ముడిలాగా ఆమె భావించింది. కానీ అతనిలోని మృగం రెండురోజుల క్రితమే బయటపడగా చివరకు భర్తకు తెలిసి ప్రాణాలే పోగొట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
 
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ లోని కమలనెహ్రూ ప్రాంతానికి చెందిన శేఖర్ గౌడ్, వరంగల్ జిల్లాకు చెందిన జ్యోతికి నెల క్రితమే వివాహమైంది. శేఖర్ గౌడ్ తమ్ముడు రాకేష్ గౌడ్, తల్లి మాత్రమే ఇంట్లో ఉంటున్నారు. తండ్రి అనారోగ్యంతో సంవత్సరం క్రితమే మృతి చెందాడు.
 
పెళ్ళయినప్పటి నుంచి రాకేష్ వదినతో సరదాగా ఉండేవాడు. ఆమె చుట్టూ తిరిగేవాడు. ఎలాంటి అనుమానం రాకుండా ఆమెతో ప్రవర్తించేవాడు. కానీ అతనిలోని మృగం రెండు రోజుల క్రితం బయటపడింది. పనిమీద అన్న బయటకు వెళ్ళడంతో వదినపై కన్నేశాడు. ఎలాగైనా ఆమెను లొంగదీసుకోవాలనుకున్నాడు. చేయి పట్టుకున్నాడు. తప్పని గట్టిగా చెప్పింది. ఇంతలో తల్లి కూడా వారించింది.
 
కానీ జరిగిన విషయాన్ని ఇద్దరూ గోప్యంగా ఉంచారు. విషయం పెద్ద కొడుక్కి తెలిస్తే గొడవ పెద్దదవుతుందని వద్దని కోడలికి నచ్చజెప్పింది. అప్పుడు వెళ్ళిపోయిన రాకేష్ గౌడ్ మళ్లీ మరుసటి రోజూ అదే పని చేశాడు. బయటకు వెళ్ళి తిరిగి వచ్చిన శేఖర్ గౌడ్ ఆ దృశ్యాలను చూశాడు.
 
జ్యోతిని బలవంతంగా గదిలోకి తోస్తుండగా గమనించాడు. ఆవేశంతో ఊగిపోయాడు. ఇంటి బయట ఉన్న గొడ్డలిని తీసుకుని పరిగెత్తుకుని వచ్చి తమ్ముడి తలపై ఒక్క పెట్టున నరికాడు. అంతే... అతను అక్కడికక్కడే కుప్పకూలిపోయి చనిపోయాడు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లాలో తీవ్ర సంచలనంగా మారింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏడాది క్రితం ట్వీట్స్ పెడితే ఇప్పుడు మనోభావాలు దెబ్బతినడం ఏంటి: వర్మ లాజిక్

నితిన్, శ్రీలీల రాబిన్‌హుడ్ నుంచి క్వీన్ విద్యా వోక్స్ పాడిన సాంగ్ రిలీజ్

తల్లి మనసు సినిమాకు సెన్సార్ సభ్యుల ప్రశంసలు

అఖిల్ అక్కినేని, జైనాబ్ రావ్‌జీల నిశ్చితార్థం చేశామన్న నాగార్జున

రోటి కపడా రొమాన్స్‌ బాగా లేదంటే సినిమాలకు రిటైర్‌మెంట్‌ : దర్శకుడు విక్రమ్‌ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments