Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కొవిడ్‌ తగ్గాక ముద్దు, ముచ్చట ఉండొచ్చా..?

Advertiesment
Covid 19
దేశంలో కరోనా వైరస్ కల్లోలం కొనసాగుతోంది. ఇలాంటి సమయాల్లో ప్రజల్లో రకరకాల భయాలు, సందేహాలు. కొవిడ్‌ వచ్చి తగ్గిన వారిలో ఈ సందేహాలు ఇంకాస్త ఎక్కువ. కొత్త దంపతుల్లో మరీ ఎక్కువగా ఉంటాయి. 
 
ముఖ్యంగా, కోవిడి బారిన తర్వాత కనీసం నెల రోజులు దాంపత్య జీవితానికి దూరంగా ఉండాలి. ఆ తర్వాత శృంగార జీవితాన్ని కొనసాగించ వచ్చు.  సాధారణంగా 15 రోజుల తర్వాత నెగెటివ్‌ వస్తుంది. ఆ తర్వాత వైరస్‌ సోకే అవకాశం ఉండదు. అయినా.. నెల రోజులు దూరంగా ఉండడం మంచిది
 
అదేసమయంలో ఆరోగ్యపరంగా ఫిట్‌గా ఉండి, శారీరకంగా చురుకుగా ఉంటే పెద్దగా ఇబ్బందులు ఏమీ ఉండవు. అయినప్పటీ భార్యాభర్తల శృంగారనికి ఓ నెల రోజుల పాటు దూరంగా ఉంటే మంచిదని వైద్యులు సలహా ఇస్తున్నారు. 
 
అదేసమయంలో వైరస్ తీవ్రత మోస్తరు నుంచి అధికంగా ఉన్న పురుషుల వీర్యం/స్త్రీ అండం ఉత్పత్తి, నాణ్యత, చురుకుదనంపై కొంత ప్రభావం ఉంటుంది. ఇలాంటి సమస్యను కొందరు పురుషుల్లో గుర్తించాం. కొవిడ్‌ రోగుల్లో.. తీవ్ర జ్వరం, ఇన్‌ఫెక్షన్‌, హార్మోన్ల అసమతౌల్యం వంటి సమస్యలు వస్తుంటాయి. ఇలాంటి స్త్రీ/పురుషుల్లో ఇబ్బందులు వస్తున్నాయి. 
 
అలాగే, పిల్లలు కనాలనుకునే వారు ముందుగా వ్యాక్సిన్ తీసుకోవాల్సి ఉంటుంది. రెండు డోసులూ పూర్తయిన 15 రోజుల వరకు గర్భం దాల్చకుండా జాగ్రత్త పడాలని వైద్యులు సలహా ఇస్తున్నారు. 
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రెండుమూడు తాజా పుదీనా ఆకులను నమిలితే ఆ సమస్య తగ్గుతుంది