Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కరోనాకి పెరటివైద్యం, ముక్కులో నిమ్మరసం పిండుకున్నాడు, మృతి చెందాడు

Advertiesment
కరోనాకి పెరటివైద్యం, ముక్కులో నిమ్మరసం పిండుకున్నాడు, మృతి చెందాడు
, గురువారం, 29 ఏప్రియల్ 2021 (16:51 IST)
కరోనావైరస్ తీవ్రం కావడంతో ప్రతి ఒక్కరు భయంతో వుంటున్నారు. కరోనా రాకుండా వుండేందుకు గతంలో ఎందరో చెక్క, లవంగాలు, అల్లం తదితర వంటింటి దినుసులు వేసి కషాయాలు కాచుకుని తాగడంతో కొందరు కాలేయ సమస్యలతో ఆసుపత్రుల్లో చేరిన ఉదంతాలు వెలుగుచూసాయి. తాజాగా అలాంటి ఘటన ఒకటి వెలుగుచూసింది.
 
నిమ్మకాయకు కరోనాను అడ్డుకునే శక్తి వుందని నమ్మిన ఓ ఉపాధ్యాయుడు ఏకంగా నిమ్మకాయ రసాన్ని ముక్కు రంధ్రాల్లో పిండాడు. అలా పిండటం ద్వారా నిమ్మరసం నేరుగా ఊపిరితిత్తుల్లోకి చేరి కరోనాను రాకుండా అడ్డుకుంటుందని అనుకున్నాడు. కానీ దురదృష్టవశాత్తూ అతడు తీవ్ర అస్వస్థతకు గురై మృతి చెందాడు. ఈ ఉపాధ్యాయుడు రాయచూరు జిల్లాకి చెందినవారు కాగా ఆయన వయసు 43 ఏళ్లు.
 
ఈ విషాద ఘటనపై వైద్యులు స్పందిస్తూ ఇలాంటి వైద్యాలు ప్రాణాలకే ప్రమాదాన్ని తెచ్చిపెడతాయనీ, వైద్యుల సూచనల మేరకే ఏదైనా ఆచరించాలని చెప్పారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బాలికపై అత్యాచారం.. ఉరిశిక్ష రద్దు.. జీవితాంతం జైలులోనే వుండాల్సిందే