చిక్కడపల్లిలో వ్యభిచారగృహం... ఫిఫ్టీ- ఫిఫ్టీ షేరింగ్‌

Webdunia
సోమవారం, 19 జులై 2021 (09:41 IST)
హైదరాబాద్ చిక్కడపల్లిలోని ఓ హోటల్‌ గదిలో వ్యభిచారగృహం నడుపుతున్నట్టు తెలిసిన చిక్కడపల్లి పోలీసులు దాడులు నిర్వహించారు.

మేనేజర్‌ బి.ఉషశ్రీ(22) సహా హోటల్‌లో హౌస్‌కీపింగ్‌ నిర్వహిస్తున్న ఇద్దరు వ్యక్తులు ఇ.శ్రీకాంత్‌(24), కె.సాయికుమార్‌(23)లను అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు. వారి నుంచి మూడు ఖరీదైన సెల్‌ఫోన్లు, పది నిరోధ్‌ ప్యాకెట్లు, 8 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు.

ఇన్‌స్పెక్టర్‌ పాలడుగు శివశంకరరావు వివరాల ప్రకారం.. సూర్యాపేటకు చెందిన ఉషశ్రీ.. హోటల్‌లోని గదిని అద్దెకు తీసుకుని సెక్స్‌వర్కర్లను రప్పించి వారికి వచ్చే ఆదాయంలో ఫిఫ్టీ- ఫిఫ్టీ షేరింగ్‌తో వ్యభిచార గృహాన్ని నిర్వహిస్తోంది.

హోటల్‌లో హౌస్‌కీపింగ్‌ చేస్తున్న సిద్దిపేటకు చెందిన శ్రీకాంత్‌, నల్గొండకు చెందిన సాయికుమార్‌ ఆమెకు సహకరించేవారు. సెక్స్‌వర్కర్లను తీసుకువచ్చేందుకు మధ్యవర్తులుగా వ్యవహరిస్తున్న విష్ణు, ధర్మ పరారీలో ఉన్నారు

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tulasi: సినిమాలకు రిటైర్మెంట్ ప్రకటించిన నటి తులసి

Rajamouli: డైరెక్టర్ రాజమౌళిపై 3 కేసులు నమోదు

Vantalakka: బిజీ షెడ్యూల్‌ వల్ల భర్త, పిల్లల్ని కలుసుకోలేకపోతున్నాను.. వంటలక్క ఆవేదన

Hero Karthi: అన్నగారు వస్తారు అంటున్న హీరో కార్తి

నేడు నయనతార బర్త్‌డే.. ఖరీదైన బహమతిచ్చిన భర్త

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం