Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇటు శ్రీశైలం, అటు సాగ‌ర్, రెంటికీ భారీగా వ‌ర‌ద నీరు

Webdunia
శుక్రవారం, 30 జులై 2021 (11:31 IST)
అటు తెలంగాణాలోని నాగార్జున సాగ‌ర్లో, ఇటు ఆంధ్ర‌లోని శ్రీశైలంలోకి భారీగా వ‌ర‌ద నీరు వ‌చ్చి చేరుతోంది. నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు కొనసాగుతున్న భారీ వరదతో ప్ర‌స్తుత నీటిమట్టం 553 అడుగులుకు చేరింది. పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా, ఇన్ ఫ్లో 2,77 640 క్యూసెక్కులు, అవుట్ ఫ్లో 29,862 క్యూసెక్కులు కు చేరింది. ప్రస్తుత నీటి నిల్వ సామర్థ్యం 216.4350 టీఎంసీలు కాగా, పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు ఉంటుంది. 
 
ఇటు క‌ర్నూలు జిల్లా శ్రీశైలం జలాశయానికి భారీగా వరద ప్రవాహం కొన‌సాగుతోంది. డ్యాం 10 గేట్లు 18 అడుగుల మేర ఎత్తి దిగువ నాగార్జునసాగర్ కు నీటిని వదులుతున్నారు. ఇన్ ఫ్లో 4,99,816 క్యూసెక్కులు కాగా, ఔట్ ఫ్లో : 4,34,850 క్యూసెక్కులుంది. పూర్తి స్దాయి నీటి మట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం  884,40 అడుగులు నీటి మ‌ట్టం చేరింది. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి నిల్వ సామ‌ర్ధ్యం 215.8070 టీఎంసీలు కాగా, ప్రస్తుతం : 211.9572 టీఎంసీలుంది. కుడిగట్టు జలవిద్యుత్ కేంద్రాల ద్వారా: 14.700 మిలియన్ యూనిట్స్
ఎడమ గట్టు జల విద్యుత్ కేంద్రాల ద్వారా 14.116 మిలియన్ యూనిట్స్ విద్యుత్ ఉత్పత్తి జరుగుతోంద‌ని 
అధికారులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెలుగులో పా.. పా..గా రాబోతున్న త‌మిళ బ్లాక్ బ‌స్ట‌ర్ డా..డా

వైవిఎస్ చౌదరి సినిమాలో వీణారావు ఫస్ట్ దర్శన్ లాంచ్ చేసిన సుప్రియ, స్వప్నాదత్

ఆడ పిల్లలు ఎదిగేందుకు తోడ్పాడు అందించాలి : నారి గ్లింప్స్ రిలీజ్ చేసిన మంత్రి సీతక్క

'పుష్ప 2' చిత్ర టికెట్ ధరల పెంపునకు టి సర్కారు అనుమతి

కిచ్చా సుదీప్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ మ్యాక్స్ సిద్దమైంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments