Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

2007 తర్వాత తొలిసారి శ్రీశైలం గేట్లు ఎత్తనున్న అధికారులు

Advertiesment
2007 తర్వాత తొలిసారి శ్రీశైలం గేట్లు ఎత్తనున్న అధికారులు
, బుధవారం, 28 జులై 2021 (12:04 IST)
శ్రీశైలం జలాశయం నుంచి బుధవారం నాగార్జున సాగర్‌కు నీటిని విడుదల చేయనున్నారు. ఎగువన కురుస్తున్న వర్షాలతో శ్రీశైలం జలాశయానికి భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. దీంతో బుధవారం మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల మధ్య జలాశయం గేట్లను పైకెత్తి సాగర్‌కు నీటిని విడుదల చేయాలని నిర్ణయించారు. 2007 తర్వాత జులైలో శ్రీశైలం నుంచి నీటిని విడుదల చేయనుండడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.
 
మరోవైపు కుడిగట్టు జలవిద్యుత్ కేంద్రంలో ఒక యూనిట్ ద్వారా విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్నారు. మంగళవారం సాయంత్రం 6 గంటల సమయానికి శ్రీశైలం జలాశయానికి జూరాల, సుంకేశుల నుంచి 3,98,288 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. 
 
కాగా, జలాశయ పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం 876.60 అడుగులుగా ఉంది. అలాగే, ప్రస్తుత నీటినిల్వ 172.6615 టీఎంసీలుగా ఉన్నట్టు అధికారులు తెలిపారు.
 
ఇదిలావుంటే, కర్ణాటకలోని తుంగభద్ర జలాశయం నుంచి వరద జలాలు మంగళవారం మధ్యాహ్నం కర్నూలు నగరంలోని సుంకేసుల జలాశయానికి చేరాయి. రాత్రి 10 గంటల ప్రాంతంలో 24 గేట్లను ఒక మీటరు ఎత్తి, సుమారు లక్షా ఆరువేలు క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పెరుగుతూ తగ్గుతూ వున్న కరోనా కేసులు.. 43వేలకు పైగా కేసులు