Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తెలంగాణాలో భారీ వర్షాలు : కడెం ప్రాజెక్టు 7 గేట్లు ఎత్తివేత

Advertiesment
Kadem Dam
, గురువారం, 22 జులై 2021 (13:12 IST)
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో రాష్ట్రంలోని పలు ప్రాజెక్టులకు జలకళ ఉట్టిపడుతోంది. అలాగే, నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. ఈ ప్రాజెక్టు పూర్తిగా నిండిపోవడంతో అప్రమత్తమైన అధికారులు.. కడెం ప్రాజెక్ట్ 7 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. 
 
ప్రస్తుతం ఈ ప్రాజెక్టుకు ఇన్ ప్లో 38,419 క్యూసెక్కలు వస్తుండగా.. ఔట్ ప్లో 49,874 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 700 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 696 అడుగులుగా ఉంది. 
 
మరోవైపు జిల్లాలోని కుంటాల మండలంలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. మండలంలో 20 సెంటీమీటర్ల వర్షాపాతం నమోదైంది. భారీ వర్షాలకు వెంకూరు చెరువు కట్ట తెగిపోయింది. చెరువు నీరంతా వాగులోకి ప్రవహిస్తున్నది. 
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

యాదాద్రి ఘాట్ రోడ్డులో విరిగిపడిన కొండ చరియలు