Webdunia - Bharat's app for daily news and videos

Install App

వ్యాపారంలో భాగస్వామ్యం చేస్తే భార్యతో భాగస్వామ్యుడైన స్నేహితుడు, చివరికి?

Webdunia
సోమవారం, 15 ఫిబ్రవరి 2021 (16:07 IST)
ఇద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకునే పెళ్ళి చేసుకున్నారు. అంటే ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరి ప్రేమకు గుర్తుగా ఇద్దరు పిల్లలు. ఒకరికేమో 7 సంవత్సరాలు మరొకరికి 5 సంవత్సరాలు. ఆర్థికంగా బాగా నిలదొక్కుకున్న ఫ్యామిలీ. చీటీలు వేసి మరీ డబ్బులు బాగా సంపాదించాడు. వ్యాపారంలో భాగస్వాముడైన స్నేహితుడిని నమ్మితే తన భాగస్వామినే లోబరుచుకున్నాడు.
 
తెలంగాణా రాష్ట్రం నల్గొండ జిల్లా తిప్పర్తి మండలం సర్వారం గ్రామంలో జక్కలి రామక్రిష్ణ, మమతలు నివాసముండేవారు. పది సంవత్సరాల క్రితమే వీరు ప్రేమించి పెళ్ళి చేసుకున్నారు. ఇంట్లో వాళ్ళ అంగీకారంతోనే పెళ్ళి చేసేసుకున్నారు. వీరికి ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు.
 
రామక్రిష్ణ వడ్డీ వ్యాపారస్తుడు. స్నేహితుడు రాజశేఖర్‌తో కలిసి వడ్డీ వ్యాపారం చేస్తుండేవాడు. బాగా సంపాదిస్తున్నాడు. బిజినెస్‌లో తనకు సహకరించిన రాజశేఖర్‌ను నమ్మాడు రామక్రిష్ణ. అతనితో కలిసి వారానికి రెండుసార్లు మద్యం సేవించేవాడు. తన ఇంటికి తీసుకెళ్ళి ఇంటి మిద్దెపైనే ఇద్దరూ కలిసి మద్యం సేవించేవారు.
 
అలా రాజశేఖర్ రామక్రిష్ణ కుటుంబానికి దగ్గరయ్యాడు. ఐతే, రామక్రిష్ణ ఇంట్లో లేని సమయంలో ఏదో వంకతో వచ్చేవాడు. అలా అతడి భార్యతో మాటలు కలిపాడు. వీలున్నప్పుడల్లా పొగడ్తలతో ముంచెత్తేవాడు. ఇక ఫోన్ నెంబర్ తీసుకుని అదే పనిగా మాట్లాడుతూ.. ఆమెను పూర్తిగా తన మాయలో పడేశాడు. ఆమెను అలా లొంగదీసుకుని ఆమెతో శారీరకంగా కలిశాడు. వీరి బాగోతం గత కొన్నినెలలుగా సాగుతోంది. అయితే రామక్రిష్ణకు అసలు విషయం తెలిసింది. భార్యను మందలించాడు. అయినా ఆమె మారలేదు.
 
తన భర్తకు నిజం తెలిసిందనీ, అతడు వుండగా మనం కలవడం అసాధ్యం కనుక ఆయనను చంపేయమని ప్రియుడిని కోరింది. దీంతో రాజశేఖర్ ప్లాన్ ప్రకారం రామక్రిష్ణను సముదాయించి వారి ఇంటి మిద్దెపైనే మద్యం తాగేందుకు సిద్థం చేశాడు. రామక్రిష్ణకు ఎక్కువగా తాగించి స్పృహ కోల్పోయేలా చేశాడు రాజశేఖర్. మమత వారి పిల్లలకు పాలలో నిద్ర మాత్రలు కలిపి ఇచ్చి పడుకోబెట్టింది.
 
ఇక రామక్రిష్ణను దిండుతో ముఖంపై గట్టిగా మూసి ఊపిరాడకుండా చంపేశాడ రాజశేఖర్. ఆ తరువాత మమత తన భర్త గుండెపోటుతో చనిపోయాడని బంధువులు నమ్మించింది. అంత్యక్రియలు రెండురోజుల క్రితం పూర్తయ్యాయి. ఇక ఏం అడ్డంకి లేదు హాయిగా ప్రియుడితో ఎంజాయ్ చేయొచ్చు అనుకుంది మమత.
 
కానీ రామక్రిష్ణ తల్లిదండ్రులు మమత వద్దకు వచ్చి కుమారుడి ఆస్తిలో కొంతభాగం ఇవ్వమని.. తాము అప్పుల్లో ఉన్నామని చెప్పారు. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన మమత మీ కొడుకును చంపేశాను.. మిమ్మల్ని కూడా చంపేయాలా అంటూ ఆవేశంతో నిజం ఒప్పేసుకుంది. దీంతో అడ్డంగా బుక్కయ్యింది.
 
రామక్రిష్ణ తల్లిదండ్రులు నేరుగా పోలీసు స్టేషన్‌కు వెళ్ళి ఫిర్యాదు చేశారు. మమతను పిలిచి తమదైన శైలిలో విచారణ చేయగా మొత్తం అసలు విషయాన్ని కక్కేసింది. రాజశేఖర్‌తో పాటు మమతను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో సీజన్ 3లో పేటీఎం సీఈఓ విజయ్ శేఖర్ శర్మ, తన డబ్బునంతా కపిల్ శర్మకు అప్పగించారా?

Natti kumar: ఫిలిం ఛాంబర్, ఫెడరేషన్ కలిసి సినీ కార్మికులను మోసం చేశారు : నట్టి కుమార్ ఫైర్

Govinda-Sunita divorce: గోవింద- సునీత విడాకులు తీసుకోలేదు.. మేనేజర్

వారం ముందుగానే థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న లిటిల్ హార్ట్స్

సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా.. జటాధర నుంచి దివ్య ఖోస్లా ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

శక్తినిచ్చే ఖర్జూరం పాలు, మహిళలకు పవర్ బూస్టర్

అబోట్ నుంచి నిరంతర గ్లూకోజ్ రీడింగులు అలర్ట్‌లతో కూడిన నెక్స్ట్-జెన్ ఫ్రీస్టైల్ లిబ్రే 2 ప్లస్‌

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments