Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పెళ్ళయినా భార్యతో కలవనివ్వని తల్లిదండ్రులు, పొలాల్లోకి తీసుకెళ్ళి శృంగారం చేయడంతో...

పెళ్ళయినా భార్యతో కలవనివ్వని తల్లిదండ్రులు, పొలాల్లోకి తీసుకెళ్ళి శృంగారం చేయడంతో...
, శుక్రవారం, 12 ఫిబ్రవరి 2021 (21:12 IST)
రెండు నెలల క్రితం ఆర్భాటంగా పెళ్ళి జరిగింది. పెద్దల ఒప్పందంతోనే పెళ్ళి కూడా జరిగింది. అయితే కట్నం అడిగినంత ఇవ్వలేదని శోభనం ఆపేశారు పెళ్ళికొడుకు తల్లిదండ్రులు. డబ్బులు ఇస్తేనే శోభనమంటూ ఇంట్లోనే ఉండనిచ్చారు. విరహం తట్టుకోలేని భర్త ఎన్నోసార్లు ఆమెకు దగ్గరవ్వాలని చూశాడు. అయినా ఉపయోగం లేకుండా పోయింది. కానీ ఒకరోజు అలా జరిగిపోయింది. వివరాలు ఇలా వున్నాయి.
 
ఉత్తరప్రదేశ్ లోని హమీర్‌పూర్‌కు మారుమూల ప్రాంతంలో ఒక గుర్తు తెలియని మృతదేహాన్ని మూడు రోజుల క్రితం పోలీసులు కనుగొన్నారు. అయితే మృతదేహం ఎవరిదోనని తెలుసుకునేందుకు ఒకరోజు సమయం పట్టింది. హమీర్‌పూర్‌కు చెందిన రాహుల్ భార్య కాంచన్‌గా గుర్తించారు.
 
మొదట్లో తనకేమీ తెలియదని పోలీసు స్టేషన్‌కు వెళ్ళి భార్య కనిపించలేదని చెప్పిన రాహల్ ఆ తరువాత పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించడంతో అసలు విషయం చెప్పేశాడు. తన భార్యను డబ్బులు తీసుకురమ్మని పుట్టింటికి వారం క్రితం పంపినట్లు రాహుల్ తెలిపాడు. 
 
అయితే ఆమె డబ్బులు ఎవరూ ఇవ్వడం లేదని చెప్పడంతో ఇక శోభనం జరగదని భావించి హమీర్‌పూర్‌కు రమ్మని చెప్పినట్లు పోలీసులకు వెల్లడించాడు. తను డబ్బులు ఇస్తానని, ఆ డబ్బును తన తల్లిదండ్రులకు ఇచ్చేయమని చెప్పి నమ్మించానన్నాడు రాహుల్. 
 
తన మాట నమ్మి బస్సులో వచ్చిన తన భార్య బస్సు దిగగానే ఊరు చివరన ఉన్న పొలాల్లోకి తీసుకెళ్ళి శృంగారం చేశానన్నాడు. రెండవసారి శృంగారం చేసే సమయంలో ఆమె శ్వాస పీల్చుకోలేకుండా ఇబ్బందిపడి చనిపోయిందని చెప్పాడు. అయితే హత్యానేరం తనపై ఎక్కడ వస్తోందన్న భయంతో ఆమె సెల్ ఫోన్‌ను పక్కనే ఉన్న బావిలో పడేసి వెళ్ళిపోయినట్లు చెప్పాడు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అత్యంత ఆకర్షణీయంగా వచ్చిన జావా 2.1