Publish Date: Sat, 06 Feb 2021 (10:51 IST)
Updated Date: Sat, 06 Feb 2021 (10:53 IST)
దేశంలోనే కాకుండా తెలుగు రాష్ట్రాల్లో మహిళలపై అకృత్యాలు జరుగుతూనే వున్నాయి. తాజాగా తెలంగాణలోని మహబూబ్ నగర్ జిల్లా నవాబు పేట మండలం హజాపుర్‌లో ఒక దారుణ సంఘటన వెలుగులోకి వచ్చింది. పెళ్లి చేసే స్థోమత లేక తమ సొంత కుమార్తెను రాజస్థాన్ వాసికి అమ్మే ప్రయత్నం చేశారు తల్లిదండ్రులు. బాలిక బంధువులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.
బాలిక విక్రయాన్ని అడ్డుకున్న పోలీసులు ఆమెను స్టేట్ హోమ్‌కి తరలించారు. బాలిక తల్లిదండ్రులు హైదరాబాదులో కూలీలుగా పని చేస్తున్నారు అని తెలుస్తోంది. బాలిక వయసు 17 ఏళ్లు కాగా పెళ్లి వయసు వచ్చేసిందని ఇక పెళ్లి చేసేయాలని వారు భావించగా కుర్ర వాళ్ళు అందరూ కట్నాలు అడుగుతున్నారని, అంత ఇచ్చుకునే స్థోమత తమకు లేదని భావించి వారు అమ్మకానికి సిద్ధం అయినట్టు చెబుతున్నారు.