Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బీహార్ విద్యార్థులకు శుభవార్త : డిగ్రీ పాస్ అయితే రూ.50 వేలు

బీహార్ విద్యార్థులకు శుభవార్త : డిగ్రీ పాస్ అయితే రూ.50 వేలు
, గురువారం, 4 ఫిబ్రవరి 2021 (13:12 IST)
రాష్ట్ర విద్యార్థులకు బీహార్ ప్రభుత్వ శుభవార్త చెప్పింది. ప్రతిభావంతులైన విద్యార్థులకు ఆర్థిక సహాయం అందిస్తామని ప్రకటించింది. ఇంటర్ పాసయిన విద్యార్థినులకు రూ.25 వేలు, గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన విద్యార్థినులకు రూ.50 వేలు అందజేస్తామని తెలిపింది. 
 
ముఖ్యమంత్రి కన్యా ఉత్థాన్ పథకం కింద ఈ నగదు మొత్తాన్ని అందజేయనున్నారు. 2021 ఏప్రిల్ ఒకటి అనంతరం పరీక్షా ఫలితాలు విడుదలయ్యాక ఈ మొత్తాలను విద్యార్థినులకు అందజేయనున్నారు.  
 
కాగా, గతంలో 10 పాసయిన విద్యార్థినులకు రూ.10 వేలు, డిగ్రీ పాసయిన విద్యార్థినులకు రూ.25 వేలు అందజేసేవారు. బీహార్ ప్రభుత్వం క్యాబినెట్ మీటింగ్‌లో విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించడంపై నిర్ణయం తీసుకుంది. 
 
ఈ సమావేశంలో ముఖ్యమంత్రి విద్యార్థి ప్రోత్సాహన్ యోజన పథకం కింద 33,66 మంది విద్యార్థినీ విద్యార్థులకు ప్రోత్సాహకాలను అందించేందుకు "బీహార్ అత్యవసర సహాయ నిధి" నుంచి రూ.34 కోట్లు ఖర్చు చేసేందుకు అనుమతినిచ్చారు. ఈ పథకంలో మెట్రిక్, ఇంటర్ ఫస్ట్ క్లాసులో పాసైన విద్యార్థులకు రూ.15 వేలు చొప్పున ఆర్థిక సహాయం అందజేయనున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఎంజీఆర్ బాడీగార్డు కన్నుమూత.. చెన్నైకి శశికళ ఎంట్రీ.. వేడెక్కనున్న రాజకీయాలు