Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఉదయం మగాడు, రాత్రయితే తేడాగాడు, 70 మంది యువతులకు శృంగార సందేశాలు

Advertiesment
ఉదయం మగాడు, రాత్రయితే తేడాగాడు, 70 మంది యువతులకు శృంగార సందేశాలు
, బుధవారం, 3 ఫిబ్రవరి 2021 (22:09 IST)
అతడి పేరు సుమంత్. హైదరాబాద్ లోని మణికొండ ప్రాంతం. ఒక ప్రైవేట్ సంస్ధలో ఉద్యోగం చేస్తున్నాడు సుమంత్. ఉదయమంతా కష్టపడి పనిచేయడం రాత్రికి తన గదికి వెళితే ఇక తేడాగా అమ్మాయిగా మారిపోవడం ఇతనికి అలవాటు. 
 
అమ్మాయిగా మారడమంటే తేడాగాడని కాదు.. అమ్మాయిల ఫోటోలను డౌన్లోడ్ చేసి ఆ ఫోటోలతో వేరే అమ్మాయిలకు ఫ్రెండ్స్ రిక్వెస్ట్ పంపడం.. వారితో క్లోజ్‌గా సందేశాలు టైప్ చేయడం లాంటివి చేయడం...ఇది అతని దినచర్య. ఇలా ఒకటి, రెండు కాదు ఏకంగా 70-మంది అమ్మాయిలతో శృంగార సందేశాలు కొట్టాడు సుమంత్. 
 
బిటెక్ చేసి కంప్యూటర్లో ఆరితేరిన సుమంత్ రాత్రయితే అస్సలు నిద్రపోడు. ల్యాప్ టాప్ పట్టుకుని కూర్చోవడం.. అందమైన అమ్మాయితో ఛాటింగ్‌లు చేయడం ఇతనికి అలవాటు. అలా తాను ఒక అమ్మాయినని చెప్పుకుంటూ కొన్ని ఫోటోలను ఎదుటి అమ్మాయిలకు పంపిస్తూ వారిని నమ్మించి అంతటితో ఆగకుండా వారి ఫోటోలను తీసుకుని బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించాడు.
 
అంతటితో ఆగలేదు. లైంగికంగా వేధించడం కూడా మొదలుపెట్టాడు. ఎప్పుడో అప్పుడు చేసిన తప్పు బయటపడుతుండగా ఒక యువతి సుమంత్ తీరులో తేడా వచ్చి సైబర్ క్రైంకు ఫిర్యాదు చేసింది. దీంతో సుమంత్ అడ్రస్ తెలుసుకుని వెళితే అతని ల్యాప్ టాప్‌లో అమ్మాయిల ఫోటోలు కుప్పలుతెప్పలుగా ఉన్నాయట. అంతేకాదు అందులో అశ్లీల వీడియోలతో పాటు అసభ్యకరంగా శృంగార సందేశాలు ఉండడం చూసి వాటిని స్వాధీనం చేసుకుని సుమంత్‌ను అదుపులోకి తీసుకున్నారట. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కుటుంబ కలహాలతో విసుగు.. భర్తను ఇంట్లో పెట్టి తాళం వేసి.. బిడ్డతో పాటు..?