Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాద్‌లో మే 26 నుంచి మే 29 వరకూ బుక్ చోర్ యొక్క లాక్ ద బాక్స్ రీలోడెడ్

Webdunia
శనివారం, 21 మే 2022 (22:35 IST)
ప్రీ ఓన్డ్ బుక్స్ కోసం ఆన్‌లైన్ బుక్‌స్టోర్ బుక్ చోర్ వినూత్నమైన బుక్ సేల్‌ను లాక్ ద బాక్స్ రీలోడెడ్ శీర్షికన నిర్వహిస్తుంది. దీనిలో భాగంగా ప్రతి పుస్తకానికీ ధర చెల్లించనవసరం లేకుండా బాక్స్‌కు ధర చెల్లిస్తే, ఆ బాక్స్‌లో పట్టినన్ని పుస్తకాలను వెంట తీసుకువెళ్లవచ్చు.

 
ఇది శ్రీనగర్ కాలనీలోని శ్రీ సత్య సాయి నిగమాగమం ట్రస్ట్ వద్ద మే 26 నుంచి మే 29వరకూ జరుగనుంది. ఈ కార్యక్రమంలో 10 లక్షలకు పైగా పుస్తకాలు ఎంచుకునేందుకు అందుబాటులో ఉంటాయి. వీటిలో ఫిక్షన్, నాన్ ఫిక్షన్, క్రైమ్, రొమాన్స్, యువత కోసం పుస్తకాలు, పిల్లల పుస్తకాలు, ఎడ్వెంచర్, సైన్స్ ఫిక్షన్ వంటివి ఉన్నాయి.

 
పుస్తక ప్రేమికులు మూడు విభిన్నమైన పరిమాణాల బాక్సుల నుంచి ఎంచుకోవచ్చు. వాటిలో ఓడిస్సీ బాక్స్ (ధర 1199 రూపాయలు), పర్శియస్ బాక్స్ (1799 రూపాయలు), హెర్క్యులస్ బాక్స్ (2999 రూపాయలు) ఉంటాయి.

 
ఈ కార్యక్రమం గురించి బుక్‌చోర్ ఫౌండర్ విద్యుత్ శర్మ మాట్లాడుతూ, " హైదరాబాద్‌లో లాక్ ద బాక్స్ రీలోడెడ్ నిర్వహించడం పట్ల సంతోషంగా ఉన్నాము. ఇప్పటికే బెంగళూరు, కోల్‌కతా, పూనె, ఇండోర్ లాంటి నగరాలలో వచ్చిన స్పందన పట్ల మేము ఆనందంగా ఉన్నాం. పుస్తక ప్రేమికులు దాదాపు 10 లక్షల పుస్తకాల నుంచి ఎంచుకోవచ్చు'' అని అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పుష్పరాజ్ "పీలింగ్స్" పాట రెడీ.. హీట్ పెంచేసిన డీఎస్పీ.. బన్నీ పొట్టిగా వున్నాడే! (video)

కన్నడ బుల్లితెర నటి శోభిత ఆత్మహత్య.. కారణం ఏంటి?

డాల్బీ విజన్ 4కే, అట్మాస్ టెక్నాలజీలో క సినిమా : హీరో కిరణ్ అబ్బవరం

M4M చూసి కిల్ల‌ర్ ఎవ‌రో గెస్ చేస్తే లక్ష రూపాయలు బహుమతి : డైరెక్ట‌ర్ మోహన్ వడ్లపట్ల

రామ్ చ‌ర‌ణ్, జాన్వీ క‌పూర్‌, బుచ్చిబాబు సానా చిత్రంలో మున్నాభాయ్ దివ్వేందు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

గర్భాశయ క్యాన్సర్‌తో బాధ పడుతున్న 83 ఏళ్ల మహిళకు విజయవంతంగా చికిత్స

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

తర్వాతి కథనం
Show comments