Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

హస్తిన పర్యటనలో సీఎం కేసీఆర్ - అఖిలేష్ యాదవ్‌తో భేటీ

Advertiesment
cmkcr
, శనివారం, 21 మే 2022 (14:59 IST)
దేశ వ్యాప్త పర్యటనలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం ఢిల్లీకి వెళ్లారు. ప్రస్తుతం హస్తినలో ఉంటున్న ఆయన శనివారం ఢిల్లీలో సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్‌తో సమావేశమయ్యారు. ఈ భేటీ సీఎం కేసీఆర్ నివాసంలో కొనసాగుతోంది. 
 
ఇందులో జాతీయ రాజకీయాలు, దేశ పరిస్థితులు, ప్రాంతీయ పార్టీల బలాలు, దేశంలో ప్రత్యామ్నాయ ఎజెండా రూపకల్పన వంటి అంశాలపై చర్చిస్తున్నారు. అలాగే, ఉత్తరప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత రాష్ట్ర, జాతీయ స్థాయిలో చోటుచేసుకున్న పరిణామాలపై వారిరువురు చర్చించారు. 
 
మరోవైపు, శనివారం సాయంత్రం ఆయన ఢిల్లీలో మొహల్లా క్లినిక్‌ను కూడా సందర్శించనున్నారనే వార్తలు వస్తున్నాయి. ఆదివారం మధ్యాహ్నం ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌తో కలిసి చండీగఢ్‌కు వెళతారు. అక్కడ కొత్త సాగు చట్టాలను రద్దు చేయాలని కోరుతూ సాగిన ఆందోళనలో అశువులు బాసిన రైతుల కుటుంబాలను ఆయన పరామర్శించి, ఒక్కో రైతు కుటుంబానికి రూ.3 లక్షల చొప్పున ఆర్థిక సాయం చేస్తారు. ఈ కార్యక్రమంలో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌తో పాటు పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ సింగ్ కూడా పాల్గొంటారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కొడుకు పుట్టాలన్న ఆశతో తాంత్రికుడితో కలిసి కుమార్తెలపై తండ్రి అత్యాచారం