Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీజేపీ తెలంగాణ ఎన్నికల అభ్యర్థుల తొలి జాబితా.. బీసీలకే..?

Webdunia
శనివారం, 21 అక్టోబరు 2023 (20:48 IST)
BJP
తెలంగాణ ఎన్నికల అభ్యర్థుల తొలి జాబితాను బీజేపీ ప్రకటించనుంది. మొత్తం 50 మంది అభ్యర్థులతో తొలి జాబితాను విడుదల చేయనున్నట్లు ఆ పార్టీ ఎంపీ లక్ష్మణ్ ప్రకటించారు. అంతేకాదు ఈ 50 మందిలో 20కి పైగా స్థానాల్లో బీసీలను బరిలోకి దింపుతున్నారు. 
 
అభ్యర్థుల ఎంపికలో బీజేపీ సామాజిక న్యాయాన్ని అనుసరిస్తుందనడానికి ఇదే నిదర్శనమని అన్నారు. సీట్ల కేటాయింపులో మహిళలు, బీసీలకు పెద్దపీట వేసినట్లు చెబుతున్నారు. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలు బీసీలను రాజకీయ బానిసలుగా చూస్తున్నాయని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ఆరోపించారు. వాళ్ల ఓట్లు కావాలి కానీ సీట్లు ఇచ్చేది లేదని దుయ్యబట్టారు. 
 
రాష్ట్రంలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ బీసీలకు పెద్దపీట వేస్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రం నుంచి 50కి పైగా స్థానాల్లో అభ్యర్థుల ఎంపిక కసరత్తు పూర్తయిందని తెలిపారు. మహిళలకు సీట్ల విషయంలో బీఆర్ ఎస్ మొసలి కన్నీరు కారుస్తోందని దుయ్యబట్టారు. 
 
మహిళల కోసం కవిత ఢిల్లీలో ధర్నాలు చేశారని, అయితే ఆ పార్టీ మహిళలకు సీట్లు ఇవ్వలేదని ఆరోపించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు మహిళలను పక్కన పెట్టాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. అభ్యర్థుల ఎంపికలో బీజేపీ సామాజిక న్యాయాన్ని అనుసరిస్తోందని వివరించారు. 
 
తొలిదశలో బీసీలకు 20కి పైగా సీట్లు కేటాయించినట్లు పేర్కొన్నారు.  కాంగ్రెస్ పార్టీ బీసీలను వాడుకుని వదిలేస్తోందని ఆరోపించారు. పార్టీ నుంచి సస్పెండ్ అయిన రాజాసింగ్ వ్యవహారాన్ని బోర్డు పరిశీలిస్తోందని లక్ష్మణ్ తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఓ హీరో ఇబ్బందికరంగా ప్రవర్తించారు.. : సినీ నటి ఖుష్బూ

డిసెంబర్ నుంచి స్ట్రీమింగ్ కానున్న హరికథ వెబ్ సిరీస్

ఖర్చుపెట్టినా దక్కని ఫలితంతో ఎస్కేప్ అయిన నిర్మాత

ఎస్ఎస్ థమన్ లాంచ్ చేసిన అల్లరి నరేష్, అమృత అయ్యర్ బచ్చల మల్లి మెలోడీ సాంగ్

కన్నప్ప లో మహాదేవ శాస్త్రిగా మోహన్ బాబు లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

క్యాబేజీతో బిర్యానీ.. పెరుగు పచ్చడితో టేస్ట్ చేస్తే.. అదిరిపోతుంది...

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

తర్వాతి కథనం
Show comments