Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిశ్శబ్ద విప్లవం, నాయకుల అంచనాలు తల్లకిందులౌతాయి: నరేష్ సెన్సేషన్ కామెంట్

Advertiesment
VK naresh
, బుధవారం, 18 అక్టోబరు 2023 (16:13 IST)
VK naresh
సినిమాలతో ప్రజలను జాగృతి పరుస్తాం. రాజకీయాలు ప్రజల్ని పీడిస్థాయి. అయితే అందరూ అలా ఉండరు. కానీ నేడు రాజకీయాలు భ్రష్టుపట్టాయి. అందుకే నేను బి.జె.బి. కి పనిచేసినా నాకు పొసగక బయటకు వచ్చాను. ఇక రాజకీయాల్లోకి వెళ్ళేది లేదని నటుడు వి.కె. నరేష్ తెలిపారు. తాజాగా ఆయన మార్టిన్ లూథర్ కింగ్ సినిమాలో నటించారు. ఇది వర్తమాన రాజకీయాలకు చెందింది అని అన్నారు.

ఆంధ్రలోని పరిస్తితి గురించి చెపుతూ, దేశంలో ఒకప్పుడు ఎమర్జెన్సీ పేరుతో నాయకులను జైల్లో పెట్టారు. అది ఇప్పటికీ మచ్చగా నిలిచింది. ఇప్పుడు ఆంధ్రలో అలా ఉంది. ప్రజాస్వామ్యం పేరుతో ఖూనీ చేస్తున్నారు. గతంలో హిట్లర్ వంటి నాయకులు కాలగర్భంలో కలిశారు. చంద్రబాబు అరెస్ట్ అనేది ప్రజాస్వామ్యంకు విరుద్ధం. రాజుల కాలం గుర్తుకు వస్తోంది. పవన్ కళ్యాణ్ కూడా ప్రజాస్వామ్యం కోసం పోరాడుతున్నారు.

టోటల్ సినిమా పరిశ్రమ చంద్రబాబు అరెస్ట్ పైన మౌనంగా లేదు. సినిమా హీరోలు ప్రజలకు కష్టాలు వస్తే జోలె పట్టుకుని నిధి సేకరణ చేశారు. కరోనా వంటి ఉపద్రవాలు వస్తే హీరోలు, నేను కూడా సేవ చేసాం. ఫైనల్‌గా చెప్పాలంటే.. ఆంధ్రలోను, ఇండస్ట్రీలోనూ నిశ్శబ్ద విప్లవం మొదలైంది. దాని ఫలితం ముందుముందు కనిపిస్తుంది అని అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

టైగర్‌ నాగేశ్వరరావుకు కోర్టు నుంచి లైన్‌ క్లియర్‌